Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మాకు నమ్మకముంది ధావన్ కొట్టేస్తాడు'

shikhar-dhawan-lands-home-hoping-to-crank-up-runs

హైదరాబాద్: ఐపీఎల్‌ 11వ సీజన్ ఆరంభం నుంచి దూకుడుతో ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకుపోతోంది. కానీ ఆ జట్టులోకి ప్రధాన బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ మాత్రం పేలవ ఆటతీరుతో నిరాశ పరుస్తున్నాడు. జట్టు నుంచి వార్నర్ తప్పుకోవడంతో ఒకింత నిరుత్సాహపడినా ధావన్‌పైన నమ్మకాలని పెట్టుకుంది. ఈ సీజన్ ఆరంభంలో చక్కటి ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. తర్వాత ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్

సఫారీ గడ్డ మీద భారత్ వన్డే సిరీస్ నెగ్గడంలో ముఖ్య పాత్ర పోషించిన గబ్బర్.. వార్నర్ లేని లోటు తీరుస్తాడని ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ యాజమాన్యం భావించింది. దానికి తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ధావన్.. తర్వాతి మ్యాచ్‌లో ముంబైపై 45 పరుగులు చేశాడు. తర్వాత మోచేతికి గాయమైనప్పటి నుంచి ధావన్ ఆట గాడి తప్పింది.

బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విలియమ్సన్

బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విలియమ్సన్

దీంతో బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ విలియమ్సన్ మోయాల్సి వస్తోంది. ఓపెనర్ ధావన్ 9 మ్యాచ్‌ల్లో 20 సగటుతో చేసింది 198 రన్సే. మిగతా జట్లతో పోలిస్తే.. అసలే సన్‌రైజర్స్ మిడిలార్డర్ బలహీనం. దీంతో బ్యాటింగ్ విభాగం మరింత బలహీనమైంది. బౌలర్లు రాణించడంతో తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ మ్యాచ్‌లు గెలుస్తోంది.

అతడేమీ ఫామ్ కోల్పోలేదని

అతడేమీ ఫామ్ కోల్పోలేదని

ప్లేఆఫ్ దశకు చేరువవుతున్న వేళ గబ్బర్ మళ్లీ పుంజుకుంటాడని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది. అతడేమీ ఫామ్ కోల్పోలేదని, తర్వాతి మ్యాచ్‌ల్లో తనదైన ఆటతీరు కనబరుస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది. గాయం కారణంగా అతడి లయ దెబ్బతింది.

బ్యాటింగ్‌కు బాగా అనుకూలం కావడంతో ధావన్

బ్యాటింగ్‌కు బాగా అనుకూలం కావడంతో ధావన్

ఒకట్రెండు రోజుల తేడాతో.. ఢిల్లీ లేదంటే పుణేలో జరిగే మ్యాచ్‌ల్లో అతడు సత్తా చాటుతాడని కోచ్ టామ్ మూడీ నమ్మకాన్ని వెలిబుచ్చాడు. ధావన్ లాంటి మంచి ఆటగాళ్లు వెంటనే ఫామ్‌ను కోల్పోరు. తమ ఫామ్‌ను పునరావృతం చేస్తారు. ఫిరోజ్ షా వికెట్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం కావడంతో ధావన్ అక్కడైనా బాగా రాణిస్తాడేమోనని జట్టు ఎదురుచూస్తోంది.

Story first published: Thursday, May 10, 2018, 15:09 [IST]
Other articles published on May 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+