ఎట్టకేలకు ట్విట్టర్‌లో చేరా!: శిఖర్ ధావన్ ఎగ్జైటింగ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ డాషింగ్ ఓపెన్ శిఖర్ ధావన్ ట్విట్టర్‌లో అకౌంట్ తెరిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు ఆడుతున్న శిఖర్ డిసెంబర్ 2న ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో అడుగుపెట్టాడు. తొలి ట్వీట్ ద్వారా అభిమానులను పలకరించాడు.
అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. అందరితో కనెక్ట్ కావడం ఉద్విగ్నతకు గురిచేస్తోందని పేర్కొన్నాడు. ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ధావన్ 2400 మందికి పైగా ఫాలోయర్లను సంపాదించుకున్నాడు. అతను SDhawan25 పేరుతో ఖాతా తెరిచాడు. తాను ఎట్టకేలకు ట్విట్టర్‌లో ఉన్నానని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు 133సార్లు రీట్వీట్లు వచ్చాయి.

కాగా, శిఖర్ ధావన్ 2004లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు ముందు అండర్ 19, అండర్ 17 ఆడారు. అతను 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో మొదటి వన్డే ఆడారు. 2013 మార్చిలో మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆరంగేట్రం చేశారు. అతను ఇక్కడే ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. 85 బంతుల్లో సెంచరీ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications