Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో.. రోహిత్‌, జడేజాలను ఓ ఆటాడుకున్న ధావన్‌

Shikhar Dhawan interview Rohit Sharma and Ravindra Jadeja about packing toys

హైదరాబాద్: కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్‌), స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్‌ (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 40) రాణించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌ బోణీ కొట్టింది. బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్లతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ధర్మశాలలో జరగాల్సిన మొదటి టీ20 వర్ష కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

ప్రత్యేక విమానంలో:

ప్రత్యేక విమానంలో:

చివరిదైన మూడో టీ20 ఈ నెల 22న (ఆదివారం) బెంగళూరులో జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనమయ్యారు. విమానంలో వెళ్తున్న సమయంలో శిఖర్ ధావన్‌ ఓ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ఓపెనర్ రోహిత్‌ శర్మ, స్పిన్నర్ రవీంద్ర జడేజాలను చూపిస్తూ.. తమ చిన్నారుల కోసం వారు కొన్న బహుమతుల గురించి ధావన్ ప్రశ్నలు వేసాడు.

లవింగ్‌ అండ్‌ కేరింగ్‌ ఫాదర్స్‌:

లవింగ్‌ అండ్‌ కేరింగ్‌ ఫాదర్స్‌:

మొదటగా రోహిత్‌ను ఏం కొన్నావని అడగ్గా.. కూతురు సమైరా కోసం ఆట బొమ్మలు కొన్నానని సమాధానం చెప్పాడు. ఇక ఏం బొమ్మలు కొన్నాడో కూడా రోహిత్ చూపించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జడేజాను ఏం కొన్నావని అడిగారు. నేను కూడా ఆట బొమ్మలే కొన్నానని జడేజా సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరినీ 'లవింగ్‌ అండ్‌ కేరింగ్‌ ఫాదర్స్‌' అంటూ ధావన్‌ పేర్కొన్నాడు. ఇదంతా పక్కనే ఉన్న ప్రొటీస్ ఆటగాళ్లు కూడా చూసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 పండండి పాప:

పండండి పాప:

శిఖర్ ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ 2014లో ఏకైక కుమారుడు జోరవర్‌కు జన్మనిచ్చింది. రోహిత్ శర్మ సతీమణి రితిక తన కుమార్తె సమైరాకు డిసెంబర్ 30 2018న జన్మించింది. ఏప్రిల్ 2016లో వివాహం చేసుకున్న జడేజా, రీవా సోలంకి 2017 జూన్‌లో ఓ పండండి పాపకు తల్లిదండ్రులు అయ్యారు.

25 కాదు.. 42 నంబర్‌ జెర్సీ:

25 కాదు.. 42 నంబర్‌ జెర్సీ:

రెండో టి20 మ్యాచ్‌లో శిఖర్ ధావన్ జెర్సీ నంబర్‌ మారింది. ఈ మ్యాచ్ ముందువరకు ధావన్‌ జెర్సీ నంబర్‌ 25. దానిని అదృష్ట సంఖ్యగా భావించి అతడి ట్విట్టర్‌ ఖాతాకు కూడా 'Sdhawan 25'గా పెట్టుకున్నాడు. అయితే ఉన్నటుండి గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో మాత్రం 42 నంబర్‌ జెర్సీతో బరిలోకి దిగాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జెర్సీ నెంబర్ మారగానే ధావన్ పరుగులు చేయడం విశేషం.

Story first published: Friday, September 20, 2019, 16:02 [IST]
Other articles published on Sep 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+