For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమాని చూపించిన ప్రేమకు ఉబ్బితబ్బిబ్బవుతోన్న శిఖర్ ధావన్

Shikhar Dhawan humbled to meet a fan and his family who came all the way from Bangalore

హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌండరీల వీరుడు శిఖర్‌ ధావన్‌కు ఓ అభిమాని అనుకోని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ సంఘటనలో ధావన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు భాగమయ్యారు. అతనికి దేశ వ్యాప్తంగా ఉన్నఅభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ తరపున ఆడుతున్న ధావన్‌ను ఓ అభిమాని ఆశ్చర్యానికి గురిచేశాడు.

'నా వీరాభిమాని శంకర్‌ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కలవడానికి శంకర్‌ కుటుంబ సమేతంగా ఏకంగా బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నాకు మద్దతుగా నిలుస్తూ, నన్ను అభిమానిస్తోన్న శంకర్‌కు అలానే నా అభిమానులందరికీ ధన్యవాదాలు' అంటు ధావన్ ట్వీట్‌ చేశాడు.

బెంగుళూరుకు చెందిన శంకర్‌ అనే వ్యక్తి ధవన్‌కు పెద్ద అభిమాని. తన అభిమాన క్రికెటర్‌ను కలవడానికి శంకర్ ఆదివారం ఏకంగా కుటుంబ సమేతంగా బెంగుళూరు నుంచి వచ్చేశాడు. శంకర్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రావడంతో ధావన్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతడిని నిరుత్సాహపరచకుండా అభిమాని కుటుంబంతో కలిసి ధావన్, అతడి భార్య ఆయేషా ఫొటో దిగారు. ఈ ఫొటోను ధావన్ తన ట్విటర్‌ పేజీలో పోస్టు చేశాడు.

ఢిల్లీకి చెందిన ఈ ఓపెనర్‌ ఐపీఎల్‌ 11లో 8 మ్యాచ్‌లలో ఆడి 30.83 సగటుతో 185 పరుగులు సాధించాడు. వీటిలో ఒక హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. గతవారమే బీసీసీఐ శిఖర్‌ ధావన్‌ను ఈ ఏడాదికి గాను అర్జున అవార్డుకు నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 7 విజయాలు, 2 ఓటములతో ఐపీఎల్‌ పాయింట్స్‌ పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తదుపరి మ్యాచ్ సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది.

Story first published: Monday, May 7, 2018, 11:13 [IST]
Other articles published on May 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+