హైదరాబాద్: శిఖర్ ధావన్... ఈ మధ్య కాలంలో భారత జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న క్రికెటర్. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంటాడు. భార్య, కుమారుడితో కలిగి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటాడు.
అలాంటి శిఖర్ ధావన్ బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఉద్వేగ పూరిత మెసేజ్‌ని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీసేన శ్రీలంక పర్యటనలో ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న ధావన్ భార్య అయేషాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
'అందమైన నా భార్య అయేషాకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ పుట్టిన రోజును కలిసి జరుపుకోవాలనుకున్నాం. నేను ఎప్పటికీ నీతోనే ఉంటా. మిస్ యూ' అని తన భార్యతో కలిసి ఉన్న ఫోటోని ధావన్ పోస్ట్ చేశాడు. ధావన్‌కి అయేషాతో 2012లో వివాహమైన సంగతి తెలిసిందే.
లంక పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ధావన్ అనుకోకుండా చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా ఈ సిరిస్‌కు దూరమవ్వడంతో అతని స్ధానంలో ధావన్ జట్టులోకి వచ్చాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ధావన్ 190 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీసేన 1-0తో ముందంజలో ఉంది. కొలంబో వేదికగా రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.