న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హమ్మయ్య.. చివరకు కాస్త జుట్టు వచ్చింది: ధావన్

Shikhar Dhawan Finally Got Some Hair In Lockdown

ఢిల్లీ: కరోనా వైరస్ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ పోటీల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాల్సిన టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌.. ఈ ఖాళీ సమయాన్ని భార్య అయేషా, కొడుకు జొరావర్‌లతో కలసి ఆనందంగా గడుపుతున్నాడు. మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటున్నాడు. భార్య అయేషా, కొడుకు జొరావర్‌లతో కలసి చేసే అల్లరిని ధావన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నాడు.

View this post on Instagram

Finally got some hair 😁

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

ఈ క్రమంలో సోమవారం శిఖర్ ధావన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ నవ్వులు పూయిస్తోంది. 'హమ్మయ్య.. ఎట్టకేలకు కాస్త జుట్టు వచ్చింది' అంటూ నెత్తి మీద విగ్గు లాంటి క్యాప్‌ పెట్టుకుని ఉన్న ధావన్‌ ఫొటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకు నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా లైకులు వచ్చాయి. 'న్యూలుక్‌ అదిరింది బ్రో' అంటూ ఫాన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ధావన్‌ నార్మల్‌ లుక్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పూర్తిగా గుండు లేదా గుండుతో పాటు పిలకతో ధావన్ మ్యాచ్‌లు ఆడడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.

శిఖర్ ధావన్‌ ఇటీవల తన ఇన్‌స్టా ఖాతాలో ఓ సరదా వీడియోను షేర్‌ చేశాడు. అందులో గబ్బర్‌కు ఆయన కొడుకు మేకప్‌ వేసాడు. మైదానంలో బ్యాట్‌తో పరుగులు పారించే ధావన్... కొడుకు దగ్గర ఓపిగ్గా మేకప్‌ చేయించుకుంటున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియోకి 'నాకే సొంతమైన చిన్నారి జోరావర్‌.. ఇంట్లోనే చేసిన మేకప్‌తో ఫన్‌' అంటూ కాఫ్టన్ రాసుకొచ్చాడు. 2010లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు 34 టెస్టులు, 136 వన్డేలు, 61 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవలే శిఖర్‌ ధావన్ పేరును బీసీసీఐ 'అర్జున అవార్డు' కోసం నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. ఇప్పడు ఏకంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు.

'భారత్‌ ఆ రెండు టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వడం మాకు ద్వంద్వ ప్రయోజనం''భారత్‌ ఆ రెండు టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వడం మాకు ద్వంద్వ ప్రయోజనం'

Story first published: Tuesday, June 30, 2020, 13:08 [IST]
Other articles published on Jun 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X