Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూగజీవాల ఆకలి తీర్చిన శిఖర్‌ ధావన్‌ (వీడియో)!!

Shikhar Dhawan Feeds Hungry Animals With Family

ఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. కుటుంబసమేతంగా ఆకలితో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించాడు. దీనికి సంబందించిన వీడియోను గబ్బర్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానాలతో పంచుకున్నాడు. వీడియోలో అతడితో పాటు కుమారుడు జోరావర్‌తో కూడా ఆవులకు ఆహారం అందించాడు. ఈ ఘటనంతా గబ్బర్ సతీమణి ఆయేషా వీడియోగా చిత్రీకరించారు.

'ఒక తండ్రిగా నా కుమారుడికి జీవితానికి సంబంధించిన విలువలు నేర్పించడం ఎంతో ముఖ్యం. అందులో ముఖ్యమైనది ఇతరుల పట్ల దయగా ఉండడం. మరీ ముఖ్యంగా అవసరమైన వారికి సహాయం చేయడం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆకలితో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించడం చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి మంచి పనులు నా కుమారుడికి నేర్పించడం చాలా గర్వంగా ఉంది. అందరూ తమ వంతుగా మంచి పనులు చేయాలని కోరుతున్నా' అని ధావన్‌ వీడియోకు కాప్షన్ రాసుకొచ్చాడు.

ఈ పోస్టు చూసిన భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కామెంట్‌ చేశాడు. 'శభాష్‌ శిఖర్ ధావన్‌' అని మెచ్చుకున్నాడు. ఇదే పోస్టుకు చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా స్పందించాడు. ఇదెంతో నచ్చిందనే అర్థం వచ్చేలా హృదయాకార ఎమోజీని జత చేశాడు. ప్రస్తతం గబ్బర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ ధావన్ ఇంటికే పరిమితమయ్యాడు. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 136 వన్డేలు 61 టీ20లు ఆడాడు.

శిఖర్ ధావన్‌ ఇటీవల తన ఇన్‌స్టా ఖాతాలో ఓ సరదా వీడియోను షేర్‌ చేశాడు. అందులో గబ్బర్‌కు ఆయన కొడుకు మేకప్‌ వేసాడు. మైదానంలో బ్యాట్‌తో పరుగులు పారించే ధావన్... కొడుకు దగ్గర ఓపిగ్గా మేకప్‌ చేయించుకుంటున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియోకి 'నాకే సొంతమైన చిన్నారి జోరావర్‌.. ఇంట్లోనే చేసిన మేకప్‌తో ఫన్‌' అంటూ కాఫ్టన్ రాసుకొచ్చాడు.

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. ఇప్పడు ఏకంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు.

Story first published: Saturday, June 13, 2020, 14:13 [IST]
Other articles published on Jun 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+