భార్యను ఒప్పించడంలో విఫలమైన ధావన్.. కౌంట‌ర్ ఇచ్చిన చహల్‌!!

ఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటాడు. ఈ క్రమంలో గబ్బర్‌ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్ప‌ట్లో బ్యాటు ప‌ట్టే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డంతో.. ఒకపక్క ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూనే మరోవైపు కొడుకుతో కలిసి పలు పాట‌ల‌కు కాలు క‌దుపుతూ చిందులేస్తున్నాడు. తాజాగా గబ్బర్ త‌న కొడుకు జొరావీర్‌తో క‌లిసి మరో పాపుల‌ర్ పాట‌కు డ్యాన్స్ చేశాడు.

కొడుకుతో కలిసి చిందులు:

కొడుకుతో కలిసి చిందులు:

తాజాగా శిఖ‌ర్ ధావ‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అందులో పంజాబీ పాట ఆజ్ న‌చ్‌లేకు తన కొడుకు జొరావర్‌తో కలిసి చిందులు వేశాడు. భార్య ఆయేషాను సైతం తనతో కలిసి కాలు కదపాలని సైగ చేశాడు. అయితే సోఫాలో హాయిగా కూర్చున్న ఆమె.. రానంటే రానని మొండికేసింది. కూర్చున్న‌చోట నుంచి అంగుళం కూడా జ‌ర‌గ‌లేదు. దాంతో 'భార్యను ఒప్పించాలంటే కొడుకు మద్దతు ఉండాల్సిందే' అని ధావన్‌ అన్నాడు.

వదిన డాన్స్‌ చేయడం మొదలుపెడితే:

వదిన డాన్స్‌ చేయడం మొదలుపెడితే:

ఈ ఫ‌న్నీ డ్యాన్స్‌కు అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చహల్ దొరికిందే ఛాన్స‌ని స్నేహితుడైన ధావ‌న్‌ను ఏడిపించే ప్ర‌య‌త్నం చేశాడు. 'భయ్యా.. వదిన డాన్స్‌ చేయడం మొదలుపెడితే జోరూ బేబీ అటు వైపుంటాడు (అంటే గబ్బర్‌ జోడీ ఎవరూ ఉండరని) మరి' అని కౌంట‌ర్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ కొడుకుతో క‌లిసే వీడియోలు చేస్తారేంటి? అని ఓ నెటిజ‌న్ శిఖ‌ర్‌ను ప్ర‌శ్నించ‌గా... కూతుర్లిద్ద‌రూ (అలియా, రియా) మెల్‌బోర్న్‌లో ఉన్నార‌ని, అందుకే వారితో క‌లిసి వీడియోలు చేయ‌లేక‌పోతున్నాన‌ని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ సంభాషణ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

పిల్లలకు క్రికెట్ కిట్లు:

పిల్లలకు క్రికెట్ కిట్లు:

లాక్‌డౌన్ సమయంలో శిఖర్‌ ధావన్‌ తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఓసారి కుటుంబసమేతంగా ఆకలితో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించగా.. మరోసారి యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశాడు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ధావన్‌.. తాజాగా మజ్లిస్ మెట్రో స్టేషన్ సమీపంలోని హిందూ శరణార్థి శిబిరానికి వచ్చి అక్కడి పిల్లలు, యువతకు క్రికెట్ కిట్లు అందించాడు

 నాలుగు నెలలుగా ఇంట్లోనే:

నాలుగు నెలలుగా ఇంట్లోనే:

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం అది నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. ఇప్పడు ఏకంగా నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకపక్క ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూనే మరోవైపు కుటుంబ సభ్యులతో సమయం ఆస్వాదిస్తున్నాడు.

బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమంగ్‌ అమీన్‌!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, July 14, 2020, 13:34 [IST]
Other articles published on Jul 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X