ముంబై: స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ బుల్లి తెర మీద సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శిఖర్ తన భార్య ఆయేషాతో కలిసి బుల్లితెర మీద సందడి చేయబోతున్నట్లు సమాచారం. నచ్ బలియే 7 అనే ప్రముఖ నృత్య ప్రధాన టీవీ రియాల్టీ షోలో పాల్గొనాలని ధావన్‌ను నిర్వాహకులు సంప్రదించారు.
అయితే ఈ విషయాన్ని అతడు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. తాము శిఖర్ ధావన్‌తో ఈ విషయమై చర్చిస్తున్నామని, షోలో ప్రదర్శన కోసం చూస్తున్నామని చెబుతున్నారు. స్టేజ్ పైన అతని ఫర్మార్మెన్స్ చూడటం ఓ అద్భుతమంటున్నారు.

కాగా, ఈ రియాల్టీ షో స్టార్ ప్లస్‌లో వస్తోంది. దీనికి ఏక్తా కపూర్ నిర్మాత. ఇది ఏడో సీజన్. ప్రస్తుత సీజన్‌కు జడ్జిలుగా ప్రముఖ నటి ప్రీతి జింతా, ప్రముఖ రచయిత చేతన్ భగత్, ప్రముఖ కొరియోగ్రాఫర్ మార్జి పెస్టోంజీ ఉంటున్నారు.