హైదరాబాద్: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. కోల్‌కతా జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది.
173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన భారీ షాట్‌కు సన్ రైజర్స్ జట్టుకు చెందిన కీలక ల్యాప్ టాప్ పగిలింది.

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ట్రెంట్‌బౌల్ట్ వేసిన రెండో ఓవర్ తొలి బంతిని ధావన్ కట్ చేశాడు. బంతి ఒక్కసారి నేలను తాకి వేగంగా బౌండరీ దాటింది. సన్ రైజర్స్‌కు నాలుగు పరుగులు లభించినా విశ్లేషణలు చేసే ల్యాప్‌టాప్ మాత్రం పగిలిపోయింది.
డగౌట్ వైపు వేగంగా వచ్చిన ఆ బంతి ల్యాప్‌టాప్ వెనక భాగాన్ని తాకింది. ఆ తీవ్రతతో దాని స్క్రీన్‌పై పగుళ్లు వచ్చాయి.
జట్టుకు సంబంధించిన కీలక సమాచారం అంతా అందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. బంతి వచ్చినప్పుడు ల్యాప్ టాప్ ముందు కూర్చున్న వ్యక్తి తప్పుకొన్నాడు కానీ దానిని రక్షించలేదు. దీంతో లక్ష్మణ్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.