
భారత స్టాండ్-ఇన్ కెప్టెన్ శిఖర్ ధావన్.. వెస్టిండీస్ వన్డే సిరీస్ గురించి మాట్లాడాడు. తమ ప్రతిభను ప్రదర్శించడానికి జట్టుకు గొప్ప అవకాశాన్ని ఈ సిరీస్ అందిస్తుందని చెప్పాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ధావన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించబోతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ లాంటి రెగ్యులర్ ప్లేయర్లు ఈ సిరీస్‌లో ఆడట్లేదు. దీంతో జట్టులోని యువ, తక్కువ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లకు అవకాశం దక్కనుంది.
ఇక BCCI వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో ధావన్ మాట్లాడాడు. ఇంగ్లాండ్‌లో సిరీస్ విజయం అనంతరం వెస్టిండీస్ పర్యటనను కూడా జట్టు తప్పకుండా ఎంజాయ్ చేస్తుందని చెప్పాడు. ఇక వెస్టిండీస్లో వాతావరణం సవాలు విసురుతుందని, కానీ ఆటగాళ్లు సవాల్ స్వీకరించడానికి బాగా సన్నద్ధమయ్యారని ధావన్ వెల్లడించాడు.
జట్టులో చాలా మంది యువకులు ఉన్నారని.. వారందరూ మెచురిటీతో ఆడేవారేనని వెస్టిండీస్‌లో ఆడటం ద్వారా కాస్త ఎక్స్‌పోజర్ పొందుతారని ధావన్ చెప్పాడు. ఈ సిరీస్ జట్టుకు అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి, కొత్త ప్రతిభను చూపించడానికి అవకాశం లాంటిదని ధావన్ వెల్లడించాడు.
'తప్పకుండా మేము ఈ పర్యటనను ఆస్వాదిస్తాం. వెస్టిండీస్‌లో వాతావరణం కొంచెం సవాలుగా మరియు కష్టంగా ఉంటుంది. కానీ నేను మా ప్లేయర్లు రాణిస్తారని భావిస్తున్నా. అవకాశాలొస్తాయి.. అందుకు ముందుగా ప్రిపరేషన్ మీదనే కన్సంట్రేషన్ చేయాలి' అని ధావన్ పేర్కొన్నాడు.