Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిరిస్ క్లీన్‌స్వీప్: ఐదో బ్యాట్స్‌మన్‌గా ధావన్ అరుదైన ఘనత

India vs West Indies 3rd T20I Highlights : India Seal 3-0 Whitewash vs Windies | Oneindia Telugu
Shikhar Dhawan completes 500 T20I runs in 2018 and he becomes the fifth batsman

హైదరాబాద్: చెన్నై వేదికగా పర్యాటక వెస్టిండిస్ జట్టుతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఖరి టీ20లో శిఖర్ ధావన్(92) టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

దీంతో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు(అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో) సాధించిన క్రికెటర్ల జాబితాలో శిఖర్ ధావన్ మూడో స్థానంలో నిలిచాడు. ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి టీ20లో శిఖర్ ధావన్‌ 92 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది టీ20ల్లో ధావన్‌ 572 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్

విరాట్ కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ కోహ్లి(641) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్‌కు చెందిన యువ క్రికెటర్ ఫకార్ జమాన్(576) నిలిచాడు. 2018లో ఫకార్ జమాన్ ఈ పరుగులు సాధించాడు. ఇక, ఈ ఏడాది 500కుపైగా పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా ధావన్ నిలిచాడు.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన ధావన్

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన ధావన్

తాజాగా విండిస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన శిఖర్ ధావన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ క‍్రమంలోనే టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మను అధిగమించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ టీ20ల్లో రోహిత్‌ శర్మ 560 పరుగులు సాధించాడు.

వెస్టిండిస్‌పై తొలి సెంచరీ నమోదు చేసిన ధావన్

వెస్టిండిస్‌పై తొలి సెంచరీ నమోదు చేసిన ధావన్

గత ఆరు టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించడంలో విఫలమైన శిఖర్ ధావన్ వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి టీ20లో మాత్రం 92 పరుగులతో రాణించాడు. అంతేకాదు వెస్టిండిస్‌పై ధావన్‌కి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆఖరి టీ20లో టీమిండియా విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

 తాజా విజయంతో భారత్ ఖాతాలో మరో రికార్డు

తాజా విజయంతో భారత్ ఖాతాలో మరో రికార్డు

తద్వారా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్‌ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్‌ను గెలవగా, పాకిస్తాన్‌ ఐదుసార్లు విజయం సాధించింది. అప్ఘానిస్తాన్‌తో కలిసి భారత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, యూఏఈ, వెస్టిండీస్‌లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్‌లను గెలిచాయి.

Story first published: Monday, November 12, 2018, 13:22 [IST]
Other articles published on Nov 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+