Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs GT: ధావ‌న్, తెవాటియా అరుదైన రికార్డులు.. ధోని త‌ర్వాత ఆ రికార్డు తెవాటియాకే సొంతం

Shikhar Dhawan completed 1000 fours in T20 format. After Dhoni, Rahul Tewatia set the record for sixes off the last two balls.

ఐపీఎల్ 2022లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో శిఖ‌ర్ ధావ‌న్, రాహుల్ తెవాటియా అరుదైన రికార్డులు సృష్టించారు. టీ20 ఫార్మాట్‌లో 1000 ఫోర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా శిఖ‌ర్ ధావ‌న్ చ‌రిత్ర సృష్టించ‌గా.. ఐపీఎల్‌లో ధోని త‌ర్వాత చివ‌రి రెండు బంతుల్లో సిక్సులు బాదిన టీం గెలిపించిన ఆట‌గాడిగా రాహుల్ తెవాటియా రికార్డు సృష్టించాడు.

తొలి భారత ఆట‌గాడిగా ధావ‌న్

తొలి భారత ఆట‌గాడిగా ధావ‌న్

గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 1000 ఫోర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. మొత్తంగా ఐదో ఆట‌గాడిగా నిలిచాడు. ఈ జాబితాలో అత్య‌ధిక ఫోర్లు బాదిన ఆట‌గాడిగా వెస్టిండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ టీ20 ఫార్మాట్లో 1132 ఫోర్లు బాదాడు. ఇక 1054 ఫోర్ల‌తో ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్​ హేల్స్​ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ 1005 ఫోర్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. మ‌రో ఆస్ట్రేలియా ఆట‌గాడు ఆరోన్ ఫించ్ 1004 ఫోర్ల‌తో నాల్గో స్థానంలో ఉన్నాడు.

ధోని త‌ర్వాత తెవాటియా

ధోని త‌ర్వాత తెవాటియా

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చివ‌రి రెండు బంతుల‌కు సిక్సులు కొట్టి గుజ‌రాత్ టైటాన్స్‌కు రాహుల్ తెవాటియా అద్భుత విజ‌యం అందించాడు. ఓడియ‌న్ స్మిత్ వేసిన ఓవ‌ర్లో తెవాటియా ఈ సిక్సులు కొట్టాడు. త‌ద్వారా ఐపీఎల్‌లో చివ‌రి రెండు బంతుల‌ను సిక్సులు కొట్టి జ‌ట్టును గెలిపించిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. తెవాటియా కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఈ రికార్డు సృష్టించాడు. 2016లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో పుణే త‌ర‌ఫున ఆడిన ధోని.. అక్ష‌ర్ పటేల్ బౌలింగ్‌లో చివ‌రి రెండు బంతుల‌ను సిక్సులు బాది జ‌ట్టును గెలిపించాడు.

గుజ‌రాత్ విజయం

గుజ‌రాత్ విజయం

ఇక ఈ మ్యాచ్ విష‌యానికొస్తే రాహుల్ తెవాటియా అద్భుత సిక్స‌ర్ల‌తో పంజాబ్ కింగ్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఘ‌న‌విజయం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాటర్ల‌లో లివింగ్ స్టోన్ 64 ప‌రుగుల‌తో చెల‌రేగాడు. మిగ‌తా వారిలో శిఖ‌ర్ ధావ‌న్ 35, జితేష్ శ‌ర్మ 23, రాహుల్ చాహ‌ర్ 22*, షారూక్ ఖాన్ 15, అర్ష్‌దీప్ సింగ్ 10* ప‌రుగులు చేశారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 3, ద‌ర్శ‌న్ 2, ష‌మీ, హార్దిక్ పాండ్యా, ఫెర్గ్యూస‌న్ త‌లో వికెట్ తీశారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో శుభ్‌మాన్ గిల్ 96 ప‌రుగుల‌తో తృటిలో సెంచ‌రీ చేజార్జుకున్నాడు. మిగ‌తా వారిలో సాయి సుద‌ర్శ‌న్ 35, హార్దిక్ పాండ్యా 27, తెవాటియా 13* ప‌రుగులు చేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో ర‌బాడ 2, రాహుల్ చాహ‌ర్ ఒక వికెట్ తీశారు.

Story first published: Saturday, April 9, 2022, 13:49 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+