Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త రికార్డు: ధావన్ సెంచరీతో అగ్రస్థానంలోకి చేరిన భారత్

Shikhar Dhawan century powers India to ODI series history

హైదరాబాద్: ధావన్ సెంచరీ అతని వ్యక్తిగత స్కోరును పెంచడమే కాదు, భారత్ జట్టుకే సరికొత్త రికార్డును తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా చేతిలో ఉన్న రికార్డు కాస్త టీమిండియా గెలుచుకుంది. 1998లో భారత్ మాత్రమే చేయగలిగిన రికార్డును దక్షిణాఫ్రికా 2015లో సమం చేయగలిగింది.

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించింది. దక్షిణాఫ్రికా(2015)లో రెండేళ్ల క్రితం సాధించిన 18 వన్డే సెంచరీల రికార్డును బ్రేక్‌ చేసింది. 2015లో సఫారీలు 18 వన్డే సెంచరీలు సాధించి ఒకనాటి టీమిండియా రికార్డును సమం చేశారు. 1998లో తొలిసారి 18 వన్డే శతకాల్ని భారత్‌ జట్టు సాధించగా, ఆపై 19 ఏళ్ల తర్వాత ఆ మార్కును సవరించింది.

డిసెంబరు 17 ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ధావన్ సెంచరీ చేయడంతో ఒకే సంవత్సరంలో 19 సెంచరీలు నమోదు చేసి మళ్లీ తానే పైచేయిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ధావన్‌ సెంచరీతో అత్యధిక శతకాల మార్కును చేరింది. ఇది ధావన్‌ కెరీర్‌లో 12వ వన్డే సెంచరీ కాగా, ఈ ఏడాది అతనికి మూడో వన్డే శతకం.

భారత్ ఇతర శతకదారులు:
2017లో భారత్‌ జట్టు వన్డేల్లో సాధించిన సెంచరీల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆరు సెంచరీలు చేయగా, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా ఆరు సెంచరీలు సాధించాడు. ఇక అజింక్యా రహానే, కేదర్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, మహేంద్ర సింగ్‌ ధోనిలు తలో ఒక సెంచరీలు చేశారు. ఫలితంగా 19 సెంచరీలతో కొత్త రికార్డును నెలకొల్పింది.

19 ఏళ్ల క్రితం భారత్‌ జట్టు తొలిసారి 18 వన్డే సెంచరీలు ఖాతాలో వేసుకుంది. ఆ ఏడాది సచిన్‌ టెండూల్కర్‌ విశేషంగా రాణించి తొమ్మిది సెంచరీలు నమోదు చేశాడు. ఫలితంగా ఆ క్యాలెండర్‌ ఇయర్‌లో 18 సెంచరీలను భారత్‌ నమోదు చేసి కొత్త రికార్డు లిఖించింది. కాగా, రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా ఆ రికార్డును సమం చేసింది.

ఇది రెండో సారి మాత్రమే కాదు.:
వన్డే చరిత్రలో ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో పది, అంతకుపైగా సెంచరీలను ఇప్పటికి పదిసార్లు భారత్ నమోదు చేసింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 11:42 [IST]
Other articles published on Dec 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+