Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుటుంబ సభ్యులతో ఇంటి టెర్రస్‌పై క్రికెట్ ఆడిన శిఖర్ ధావన్ (వీడియో)

Watch Video : Shikhar Dhawan Plays Cricket On Terrace With Family || Oneindia Telugu
 Shikhar Dhawan celebrates Bhai Dooj with family: Such days always make me so happy

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌కు ముందు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేశాడు. దీపావళి పండుగను పురస్కరించుకుని అన్నా-చెల్లెల్ల బంధాన్ని చూపే "భాయ్‌ దూజ్‌" వేడుకను ధావన్ తన కుటుంబంతో కలిసి చేసుకున్నాడు.

ఈ సందర్భంగా ఇంటి టెర్రస్ మీద క్రికెట్ ఆడుతున్న వీడియోని తన ఫేస్‌బుక్ పేజిలో అభిమానులతో పంచుకున్నాడు. "ఈ రోజు కుటుంబంతో మంచిగా గడిపాను. ఇలాంటి రోజులు ఎప్పుడూ నన్ను చాలా సంతోషపరుస్తాయి. అందరికీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు" అని ధావన్ కామెంట్ పెట్టాడు.

మరోవైపు ఇంటి టెర్రస్‌పై కుటుంబ సభ్యులతో కలిసి క్రికెట్ ఆడిన వీడియోని కూడా శిఖర్ ధావన్ అబిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేస్తుండగా పలువురు కుటుంబ సభ్యులు ఫీల్డింగ్ చేస్తుండటాన్ని మనం చూడొచ్చు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌‌కప్‌లో ధావన్ గాయపడిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన శిఖర్ ధావన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. వరల్డ్‌కప్ తర్వాత వెస్టిండిస్ పర్యటనలో చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 2, 36 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ధావన్ 38 యావరేజితో 76 పరుగులు చేశాడు.

33 ఏళ్ల శిఖర్ ధావన్ తన ఆశలన్నీ బంగ్లాదేశ్ సిరిస్‍‌పైనే పెట్టుకున్నాడు. నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి.

అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభం కానున్నాయి. నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు.. నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

భారత్‌లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్:
1st T20I - New Delhi (November 3) - 7:00 PM (IST)
2nd T20I - Rajkot (November 7) - 7:00 PM (IST)
3rd T20I - Nagpur (November 10) - 7:00 PM (IST)

1st Test - Indore (November 14-18) - 9:30 AM (IST)
2nd Test - Kolkata (November 22-26) - 9:30 AM (IST)

TV Channels: Star Sports Network
Live Streaming: HotStar.com

Story first published: Tuesday, October 29, 2019, 17:13 [IST]
Other articles published on Oct 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+