Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పిచ్‌పై నాగిని డ్యాన్స్ చేయి: ధావన్ బర్త్ డేకి సెహ్వాగ్ ట్వీట్

హైదరాబాద్: సోమవారం (డిసెంబర్ 5)తో 31వ వసంతంలోకి అడుగుపెట్టిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అనతి కాలంలో జట్టులో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ధావన్‌కు సహచర క్రికెటర్లతో పాటు పలువురు మాజీలు పుట్టినరోజు విషెస్ తెలిపారు.

టీమిండియా ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధావన్ క్రికెట్‌లో అడుగుపెట్టిన చాలా ఏళ్లకు గానీ టీమిండియాలో ఆడే అవకాశం రాలేదు. చెప్పాలంటే తనతో పాటు ఢిల్లీ జట్టుకు ఆడిన రైనా, దినేశ్ కార్తిక్, విరాట్ కోహ్లీకి టీమిండియాలో అవకాశం దక్కినా శిఖర్ ధావన్‌కు లేట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్‌కు తొలిసారి చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ వన్డేలో ధావన్ కేవలం రెండు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం ఆడిన ఇరానీ కప్‌లో రెండు సెంచరీలతో చెలరేగిపోయాడు.

దీంతో ఫామ్‌లోకి వచ్చిన ధావన్‌ను 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 జట్టులో చోటు లభించింది. ఇక్కడ కూడా విఫలమయ్యాడు. ఫలితంగా మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. మూడేళ్ల తర్వాత 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌కు ఎంపికయ్యాడు. దూకుడు తగ్గించి నిలకడగా ఆడటం మొదలుపెట్టాడు.

అంతేకాదు షాట్లను ఎంచుకునే విధానంలో కూడా పరిణితి సాధించడంతో తొలి టెస్టులోనే అత్యంత వేగంగా సెంచరీ (187 పరుగులు) సాధించాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ రికార్డుని నెలకొల్పాడు. గాయం కారణంగా ఆ సిరిస్ నుంచి తప్పుకున్నా ఆ తర్వాత టీమిండియాకు ఓపెనర్‌గా అనేక విజయాలనందించాడు.

ధావన్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు:

వీరేంద్ర సెహ్వాగ్

ఎప్పటిలాగే తన సహచర క్రికెటర్ ధావన్‌కు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. ఈసారి బ్యాటింగ్ కు వెళ్లాక క్రీజ్ లో నాగిని డ్యాన్స్ చేయమని సెహ్వాగ్ సూచించాడు. ధవన్.. బ్యాటింగ్ కు వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో భూమి పూజ చేసి, ఆ తరువాత పిచ్‌లో నాగిని డ్యాన్స్ చేస్తే మంచిదన్నాడు. కనీసం రెండు గంటలు పిచ్ లో నాగిని డ్యాన్స్ శిఖర్‌కు మంచిదంటూ ట్వీట్ చేశాడు.

అనిల్ కుంబ్లే

వచ్చే ఏడాది ధావన్‌కు వండర్ పుల్ ఇయర్ కావాలంటూ టీమిండియా హెచ్ కోచ్ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశాడు.

బీసీసీఐ

శిఖర్ ధావన్ పుట్టిన రోజుని పురస్కరించుకుని బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది.

గౌతం గంభీర్

వచ్చే ఏడాది ధావన్ మరిన్ని పరుగులు చేయాలంటూ టీమిండియా అటగాడు గంభీర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

హార్భజన్ సింగ్

ధావన్‌కు టీమిండియా మాజీ ఆటగాడు హార్భజన్ సింగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

యువరాజ్ సింగ్

గబ్బర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్

శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ధావన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+