Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాపై 1000 పరుగులు: ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా ధావన్ రికార్డు

Shikhar Dhawan becomes fifth Indian batsman to score 1000 ODI runs against Australia

హైదరాబాద్: వాంఖడె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై 1000 పరుగులు నమోదు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు.

ధావన్‌కు ముందు సచిన్ టెండూల్కర్(3077), రోహిత్ శర్మ(2047), విరాట్ కోహ్లీ(1727), మహేంద్ర సింగ్ ధోని(1660)లు ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(9), అయ్యర్(2) పరుగులతో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(10) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను శిఖర్ ధావన్ తన భుజాలకెత్తుకున్నాడు.

కేఎల్ రాహుల్ కొంచెం నెమ్మదిగా ఆడినప్పటికీ... శిఖర్ ధావన్ మాత్రం చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 28వ హాఫ్ సెంచరీ.

వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు వందకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ ముంగిట ఆస్టన్ అగర్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శిఖర్ ధావన్(74) సైతం ఔటయ్యాడు.

Story first published: Tuesday, January 14, 2020, 16:00 [IST]
Other articles published on Jan 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+