
ఆరో బ్యాట్స్‌మన్‌గా నిలవనున్న శిఖర్ ధావన్
తద్వారా భారత్ తరుపున టీ20ల్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ నిలవనున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన ధావన్ మంగళవారం లక్నో వేదికగా జరుగనున్న రెండో టీ20లో ఈ మార్కుని అందుకునే అవకాశం ఉంది.

ముందు వరుసలో విరాట్ కోహ్లీ
ఇప్పటివరకు భారత్ తరుపున టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ధోని, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మలు ఉన్నారు. ఇక, భారత తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు అందుకున్న ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.

రెండో స్థానంలో విరాట్ కోహ్లీ
అయితే, మొత్తంగా చూస్తే విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ సాధించిన రికార్డుని ఆదివారం పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం అధిగమించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్‌ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధిస్తే, బాబర్ అజాం 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనతను అందుకుని కోహ్లీని అధిగమించాడు.

20 పరుగుల దూరంలో శిఖర్ ధావన్
విండిస్‌తో మూడు టీ20ల సిరిస్ ఆరంభానికి ముందు శిఖర్ ధావన్ 1000 పరుగుల మైలురాయిని అందుకునేందుకు 23 పరుగుల దూరంలో నిలిచాడు. ఈ సిరిస్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20లో ధావన్ 8 బంతులను ఎదుర్కొని 3 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ధావన్ మరో 20 పరుగులు చేస్తే ఈ మైలురాయిని అందుకుంటాడు.


Click it and Unblock the Notifications












