Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ కోసం లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుంది: ఎవరీ షికా పాండే!

హైదరాబాద్: లక్షల్లో జీతం... ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం. ఇంతటి మంచి అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. అయినా సరే ఆమె వద్దు అనుకుంది. ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులు కోవడానికి ఏదైనా కారణం ఉందా? అవుననే చెప్పాలి.

అదే దేశం తరుపున క్రికెట్ తరుపున ఆడే అవకాశం ఆమెను ఈ ఉద్యోగాన్ని వదులుకునేలా చేసింది. క్రికెట్‌పై ఉన్న మమకారం ఆమెను భారత మహిళల జట్టులో చోటు దక్కించుకునేలా చేసింది. ఆమె మరోవరో కాదు. ప్రస్తుతం భారత మహిళల జట్టులో పేస్ సంచలనంగా రాణిస్తున్న షికా పాండే.

గోవాకు చెందిన షికా పాండే చిన్నతనం నుంచే చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. 15 ఏళ్ల వయసులోనే 2004 నుంచి గోవా తరఫున మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత 2007-08 సీజన్‌లో గోవా మహిళల సీనియర్‌ జట్టుకు ఆడింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు క్రికెట్‌లో రాణించింది.

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన షికా పాండే

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన షికా పాండే

అంతేకాదు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా... భారత మహిళల జట్టులో స్ధానం కోసం వాటిని వద్దు అనుకుంది. ఈ నేపథ్యంలో 2010 ఇంగ్లాండ్‌ పర్యటనకు ఆమెను జట్టులో ఎంపిక చేయకపోవడంతో అనంతరం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించింది.

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం

ఆ తర్వాత అక్కడ ట్రైనింగ్ పూర్తిచేసుకుని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరింది. ఈ ఉద్యోగం చేస్తూనే తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కలను మాత్రం ఎంత మాత్రం వీడలేదు. ఆ తర్వాత క్రికెట్ పట్ల ఆమెకున్న మక్కువ, ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు 2014 బంగ్లాదేశ్‌తో టీ20 పర్యటనకు జట్టుకు ఎంపికచేశారు.

భారత మహిళల జట్టులో సుస్థిర స్ధానం

భారత మహిళల జట్టులో సుస్థిర స్ధానం

బంగ్లాదేశ్ పర్యటనలో షికా పాండే అద్భుత ప్రదర్శన చేసి భారత మహిళల జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం మహిళా వరల్డ్ కప్‌లో ఫాస్ట్ బౌలర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తోంది. మరో పేసర్ ఝలన్ గోస్వామితో కలిసి చక్కటి స్పెల్ వేస్తోంది. ఇదిలా ఉంటే గోవా తరుపున పురుషుల్లో గానీ, మహిళల్లో గానీ ఇప్పటివరకు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.

గోవా తరుపున ఏకైక క్రికెటర్

గోవా తరుపున ఏకైక క్రికెటర్

దీంతో గోవా రాష్ట్రం తరుపు నుంచి భారత క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఏకైక క్రికెటర్‌గా షికా పాండే అరుదైన గుర్తింపు సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+