
సౌరాష్ట్ర వికెట్ కీపర్ కం బ్యాటర్ షెల్డన్ జాక్సన్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు అతను ఎంపిక కావట్లేదు. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేయట్లేదని తనకు ఓ సెలక్షన్‌కు సంబంధించిన ఓ అధికారి తనతో చెప్పినట్లు అతను పేర్కొన్నాడు. ఈ 35ఏళ్ల బ్యాటర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో కోల్‌కతా తరఫున అరంగేట్రం చేశాడు.
అయితే అతను ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే దేశీయ క్రికెట్లో అతను బాగా ఆకట్టుకున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 50కంటే ఎక్కువ సగటును మెయింటెన్ చేశాడు. జాక్సన్ 79ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 50.4సగటుతో 5,947పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో 10,000పరుగులకు దరిదాపుల్లో ఉన్నాడు.
ఇక జాక్సన్ తనను టెస్ట్‌లకు ఎంపిక చేయకపోవడంపై మాట్లాడుతూ.. 'నన్ను ఎందుకు ఎంపిక చేయట్లేదు అనే దానిపై నాకు ఎలాంటి సమాచారం లేదు. నేను ఇంకా ఏమి చేయాలని ఓ సెలక్షన్‌కు సంబంధించిన పర్సన్‌ను అడిగాడు. అతను నేను కాస్త ఏజ్‌డ్ పర్సన్ అని పేర్కొన్నాడు. 30ఏళ్లు పైబడిన వారు ఎవరినీ ఎంపిక చేయడం లేదని చెప్పారు.
కానీ చివరికి నా ముందే 32, 33ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. నాకు తెలియక అడుగుతా.. 30, 35, లేదా 40ఏళ్లు పైబడిన తర్వాత జట్టులోకి ఎంపిక చేసుకోకూడదనే చట్టం ఏదైనా ఉందా? అలా ఉంటే ఆ చట్టాన్ని మీరు ఎందుకు బహిరంగంగా ప్రస్తావించారు.? అంటూ జాక్సన్ ఓ ప్రముఖ మీడియాతో పేర్కొన్నాడు. ఇక నన్ను ఎన్నిసార్లు ఎంపిక చేయకున్నా.. అన్నిసార్లు నేను ఎంపికయ్యేందుకు ప్రయత్నిస్తాను. అని అతను తెలిపాడు.