Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : డబ్ల్యూపీఎల్‌లో షెఫాలీ తుఫాన్.. ఫిదా అయిపోయిన ఫ్యాన్స్!

Shefali Storm in WPL 2023 fans hail the DC opener

కొన్నిరోజుల క్రితం టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా యువ ఓపెనర్ షెఫాలీ వర్మ ఫామ్‌లో కనిపించలేదు. ఆ మెగా టోర్నీ ముగిసిన రోజుల వ్యవధిలోనే తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని షెఫాలీ నిరూపించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా వచ్చిన ఆమె కెప్టెన్ మెగ్ లానింగ్‌తో కలిసి ఆ జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్ అందించింది. తొలి ఓవర్ నుంచే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన లానింగ్, షెఫాలీ జోడీ.. తమ ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా నిదానంగా ఆడే ప్రయత్నం చేయలేదు. ఆర్సీబీ బౌలర్లపై ఎదురు దాడి చేసిన వీళ్లిద్దరూ బౌండరీల మోత మోగించారు. ముఖ్యంగా షెఫాలీ అయితే సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయింది.

ఈ క్రమంలోనే డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత కూడా తన బ్యాటింగ్‌లో జోరు తగ్గించలేదు. కేవలం 45 బంతుల్లోనే 84 పరుగులు చేసిన షెఫాలీ.. తన ఇన్నింగ్సులో పది ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదింది. అంతేకాదు, ఫీల్డింగ్‌లో కూడా అద్భుతంగా రాణించింది. ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ అందించిన డివైన్‌ అవుటవడంలో ఆమెదే కీలక పాత్ర. క్యాప్సీ వేసిన బంతిని డివైన్ బౌండరీకి బాదేందుకు ప్రయత్నించి. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షెఫాలీ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన షార్ప్ క్యాచ్ అందుకుంది.

ఆమె ఈ క్యాచ్ సరిగా పట్టిందా? లేదా? అని అంపైర్లు కూడా చెక్ చేశారు. కానీ బంతికి, నేలకు మధ్యలో ఆమె చేతులు ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో డివైన్ పెవిలియన్ చేరింది. ఇలా అన్ని విషయాల్లో షెఫాలీ అద్భుతంగా రాణించడం చూసిన అభిమానులు ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. నెట్టింట ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. 'డబ్ల్యూపీఎల్‌లో షెఫాలీ తుఫాన్' అంటూ సోసల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Sunday, March 5, 2023, 22:25 [IST]
Other articles published on Mar 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+