For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంజలి తప్ప వేరే అమ్మాయి తెలియదు: పెళ్లిపై సచిన్

By Srinivas

ముంబై: తన కంటే వయస్సులో పెద్దదైన అంజలిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం పైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆసక్తికరమైన కారణాన్ని వెల్లడించాడు. వేరే అమ్మాయి ఎవరూ తెలియక ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.

తనకు తెలిసిన, తాను కలిసిన ఏకైక అమ్మాయి అంజలియే అన్నాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ నేను చాలా బిజీగా ఉండేవాడినని చెప్పాడు. ఓసారి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన భార్య అంజలికి ఫోన్ చేసి.. నేను ఇంత నొప్పితో ఉండగా నీవెప్పుడూ చూడలేదని, వీడియో కెమెరా తేవాలని సూచించాడట.

She was the only one I met: Sachin on wife Anjali

తన జీవితంలోనే మధురమైన క్షణం గురించి కూడా మాస్టర్ బ్లాస్టర్ చెప్పాడు. ఓసారి పక్షవాతంతో కదలలేని స్థితిలో ఉన్న ఓ చిన్న పిల్లాడిని మాస్టర్‌ కలిశానని చెప్పాడు. సచిన్‌ బ్యాట్‌ తీసుకుని ఆ పిల్లాడు మూడు బంతులు ఆడాడని, ఆ తర్వాత మళ్లీ ఎప్పటి స్థితిలోకే వెళ్లిపోయాడని చెప్పాడు.

సచిన్ టెండుల్కర్ ఓ కార్యక్రమంలో ఆదివారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎదురైన చేదు, తీపి జ్ఞాపకాలను సచిన్ టెండుల్కర్ పంచుకున్నాడు. కెప్టెన్సీ చేపట్టిన తొలిసారి తనకు సెలక్టర్ల నుంచి తగినంత మద్దతు లేదని అర్థమైందని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+