For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvWI: లంచ్ విరామానికి టీమిండియా స్కోరు 133/1

India vs West Indies 2018 : Prithvi Shaw And Pujara Steady The Indian Innings
Shaw, Pujara take hosts to lunch on 133/1

హైదరాబాద్: భారత్-వెస్టిండీస్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా దిగిన పృథ్వీ షా, కేఎల్ రాహుల్‌లు చక్కని భాగస్వామ్యం నెలకొల్పుతారని భావిస్తే తొలి ఓవర్లోనే ఎల్బీగా డకౌట్ అయి పెవిలియన్ చేరాడు రాహుల్.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పూజారా.. పృథ్వీతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో లంచ్ విరామానికి 25 ఓవర్లు ఆడిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి 133పరుగులు చేసింది. అరంగ్రేట మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ రికార్డు నెలకొల్పడమే కాకుండా అదీ 56బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. కెప్టెన్ చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్న పృథ్వీ షా 101.35సగటుతో బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

1
44264

జట్టులో మార్పులు చేసిన టీమిండియా మేనేజ్‌మెంట్ ధావన్ స్థానంలో షాను జట్టులోకి తీసుకుంది. అతనితో పాటుగా మయాంక్‌ను 15మంది జట్టులోకి తీసుకున్నా తుది జట్టులో స్థానం కోల్పోయాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత బరిలోకి దిగిన పూజారా.. 74 బంతులాడి తొమ్మిది ఫోర్ బౌండరీలతో 56 పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్‌లలో రాణించలేకపోయిన పూజారాకు మరో అవకాశం కింద సెలక్టర్లు వెస్టిండీస్‌తో ఆడేందుకు అవకాశమిచ్చారు.

భారత్ జట్టు:
Lokesh Rahul, Prithvi Shaw, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravichandran Ashwin, Ravindra Jadeja, Umesh Yadav, Mohammed Shami, Kuldeep Yadav

వెస్టిండీస్ జట్టు:
Kraigg Brathwaite (c), Kieran Powell, Shimron Hetmyer, Shai Hope, Roston Chase, Sunil Ambris, Shane Dowrich (wk), Keemo Paul, Devendra Bishoo, Sherman Lewis, Shannon Gabriel

Story first published: Thursday, October 4, 2018, 12:32 [IST]
Other articles published on Oct 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+