For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాన్న కఠినంగా ఉండటం వల్లే.. ఆడగలుగుతున్నా', పృథ్వీ షా హాఫ్ సెంచరీ

Shaw and Pujara steady the Indian innings

న్యూ ఢిల్లీ: భారత్-వెస్టిండీస్‌ల మధ్య గురువారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌ను టీమిండియా భారీ అంచనాలతో మొదలుపెట్టింది. ఆరంభ ఓవర్‌లోనే భారత్ తొలి వికెట్‌గా కేఎల్ రాహుల్‌ను కోల్పోయింది. గాబ్రియేల్ వేసిన బంతికి ఎల్బీగా అవుటైన రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ స్థానంలో పూజారా క్రీజులోకి దిగి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 89/1గా ఉంది.

1
44264

పృథ్వీ షా (50) 56 బంతుల్లో హాఫ్ సెంచరీ

పృథ్వీ షా (50) 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనితో పాటు మరో ఎండ్‌లో ఉన్న పూజారా(38)49 బంతులు ఆడాడు. అరంగ్రేటం మ్యాచ్‌లో ఒత్తిడిగా ఉందని అయినా బౌలర్‌లను ఎదుర్కొని జట్టుకు మంచి స్కోరు సాధిస్తానని షా మాటిచ్చాడు. ఈ మ్యాచ్ జరిగే ముందు పూజారా చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

 అత్యున్నత స్థాయిని అందుకోవడంలో తండ్రి పాత్ర

అత్యున్నత స్థాయిని అందుకోవడంలో తండ్రి పాత్ర

ఈ క్రమంలో భారత టెస్టు జట్టులోకి వచ్చే ముందు.. వచ్చాక కొన్నేళ్ల పాటు చెతేశ్వర్‌ పుజారా తన ఊర్లో, ఇంట్లో జరిగే ఏ పండుగల్లోనూ పాల్గొనేవాడు కాదట. పుజారాకు క్రికెట్లో ఓనమాలు నేర్పి, అతను అత్యున్నత స్థాయిని అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన తండ్రి ఈ విషయంలో అతడికి ఆంక్షలు విధించాడట. ‘మా నాన్న చాలా కఠినంగా ఉండేవాడు.'

దీపావళికి టపాసులూ కాల్చనిచ్చేవాడు కాదు

దీపావళికి టపాసులూ కాల్చనిచ్చేవాడు కాదు

'ముఖ్యంగా నా కెరీర్‌ తొలి రోజుల్లో. మా ఊర్లో జరిగే గాలిపటాల పండుగకు నన్ను వెళ్లనిచ్చేవాడు కాదు. అలాగే దీపావళికి టపాసులూ కాల్చనిచ్చేవాడు కాదు. అలా చేసి నేను గాయపడితే కొన్ని రోజులు ప్రాక్టీస్‌కు దూరమవుతానేమో అని ఆయన భయం. ఆయన అంత కఠినంగా ఉండటం వల్లే నేను ఆటపై శ్రద్ధ పెట్టగలిగా. నాకు 17 ఏళ్ల వయసుండగా అమ్మను కోల్పోయా. అయినప్పటికీ స్థైర్యం కోల్పోకుండా ఆట మీదే దృష్టిసారించగలిగానంటే అందుక్కారణం నాన్నే' అని పుజారా చెప్పాడు.

బరిలోకి దిగిన ఇరు జట్ల వివరాలు

భారత్ జట్టు:

Lokesh Rahul, Prithvi Shaw, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravichandran Ashwin, Ravindra Jadeja, Umesh Yadav, Mohammed Shami, Kuldeep Yadav

వెస్టిండీస్ జట్టు:

Kraigg Brathwaite (c), Kieran Powell, Shimron Hetmyer, Shai Hope, Roston Chase, Sunil Ambris, Shane Dowrich (wk), Keemo Paul, Devendra Bishoo, Sherman Lewis, Shannon Gabriel

Story first published: Thursday, October 4, 2018, 11:39 [IST]
Other articles published on Oct 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+