Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పట్లో నేను కూడా అతనిలాగే ఉండేవాడిని.. పాక్ పేసర్ పట్ల షాన్ టెయిట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shaun Tait Intresting Comments About Naseem Shah, Tait Feels that younger Age he is like Naseem

ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఫాస్ట్ బౌలర్ నసీమ్ షాపై పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ షాన్ టెయిట్ ప్రశంసల జల్లు కురిపించాడు. 19ఏళ్ల నషీమ్ షా.. టోర్నమెంట్‌లో కొన్ని అద్భుత ప్రదర్శనలు చేశాడు. అరంగేట్రంలోనే అదరగొట్టేలా ఆడాడు. భారత్, అలాగే ఆఫ్ఘనిస్తాన్‌ జట్లతో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లలో పాకిస్థాన్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇకపోతే పాక్ బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్న టెయిట్.. ఒకప్పుడు అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు. అతని మార్గదర్శకత్వంలో నసీమ్ షా రాటుదేలుతున్నాడు. ఇక నషీమ్ షా సామర్థ్యాలను చూస్తుంటే తనలాగే అనిపిస్తుందని షాన్ టెయిట్ పేర్కొన్నాడు. అతనో స్వేచ్ఛాయుత స్పిరిట్ కలిగిన ప్లేయర్ అంటూ కొనియాడాడు.

నసీమ్ షా అద్భుత క్రికెటర్ కాగలడు

నసీమ్ షా అద్భుత క్రికెటర్ కాగలడు

'నేను నా యుక్తవయసులో క్రికెటర్‌గా ఉన్నప్పుడు అచ్చు నసీమ్ షాలాగే ఉండేవాడిని.. నషీమ్ షాను చూస్తుంటే సేమ్ అప్పట్లో నేను ఎలా ఆడేవాడినో గుర్తుకొస్తుంది. నషీమ్ షా ఒక విధమైన స్వేచ్ఛాస్ఫూర్తిని కలిగి ఉంటాడు. కానీ నేను ఆ వయసులో నసీమ్ షా అంత తెలివితేటలు లేవు. న్యూ బాల్‌తో నసీమ్ షా సహజ సామర్థ్యాలను, నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు. ఆ విషయాన్ని మీరందరూ చూసే ఉంటారని నేను భావిస్తున్నాను. నసీమ్ షా ఓ అద్భుతమైన క్రికెటర్ కాగలడు.' అని షాన్ టెయిట్ అన్నాడు.

రేపటి నుంచి పాక్ - ఇంగ్లాండ్ టీ20 సిరీస్

రేపటి నుంచి పాక్ - ఇంగ్లాండ్ టీ20 సిరీస్

ఇకపోతే పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక సిరీస్ ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో షాన్ టెయిట్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ ఆసియా‌కప్ ఫైనల్లో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఇక ఆ జట్టు టీ20 ప్రపంచకప్ మీద ఫోకస్ పెట్టింది. అంతకుముందు దుర్భేద్యమైన ఇంగ్లాండ్‌ను స్వదేశంల ఎదుర్కోబోతుంది. ఇది టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్‌కు సన్నాహకంగా ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ సెమీ ఫైనల్ వరకు చేరుకుంది. అయితే హసన్ అలీ సెమీస్లో క్యాచ్ మిస్ చేయడంతో ఆ జట్టు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్ జట్టు పేస్ బౌలింగ్ ఆప్షన్లకు పెట్టింది పేరు. ఆ జట్టు పేస్ అనుకూలించే ఆస్ట్రేలియాలో మంచి ప్రదర్శన కనబర్చే అవకాశముంది.

పాకిస్థాన్ బౌలింగ్ సంస్కృతి అలాంటిది

పాకిస్థాన్ బౌలింగ్ సంస్కృతి అలాంటిది

'పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు సహజమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. వారు విషయాలను చాలా సింపుల్‌గా ఉంచుకునేలా ఇష్టపడతారు. జట్టు తరఫున ఆడిన పేసర్లలో కొన్నేళ్లుగా మంచి నైపుణ్యం ఉంటూనే ఉంది. ఇప్పటికీ ప్రస్తుతమున్న కుర్రాళ్లలో కూడా అది పాతుకుపోయింది' అని టెయిట్ పాకిస్థాన్ పేస్ బౌలింగ్ సంస్కృతి గురించి చెప్పాడు. ఇకపోతే ఆతిథ్య ఇంగ్లాండ్‌తో 7మ్యాచ్‌ల T20సిరీస్ అలాగే ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంటుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌, పాక్ కలిపి ముక్కోణపు సిరీస్ ఆడతాయి. ఇకపోతే టీ20ప్రపంచకప్‌కి వెళ్లే ముందు.. ఈ రెండు సిరీస్లు పాక్‌కు కాస్త సన్నాహకంగా కానున్నాయి.

Story first published: Monday, September 19, 2022, 10:54 [IST]
Other articles published on Sep 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+