Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఎలాంటి ప్రణాళికలు పనిచేయవు.. సచిన్ తప్పు చేసేవరకూ ఎదురుచూసే వాళ్లం'

Shaun Pollocks says Sachin Tendulkar as best batsman of his generation

జోహెనస్‌బర్గ్‌: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌పై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్‌ పొలాక్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తన తరం క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ అనడంలో ఇల్లాంటి సందేహం లేదు అని పొలాక్‌ అన్నాడు. సచిన్ పరిస్థితులకు తగ్గట్టు తన ఆటను మార్చుకుంటాడని ప్రశంసించాడు. వికెట్ తీయాలంటే సచిన్‌ తప్పు చేసేంతవరకూ ఎదురు చూడడం తప్ప మరో మార్గం ఉండేది కాదని పొలాక్‌ తెలిపాడు.

తాజాగా స్కైస్పోర్ట్స్‌తో షాన్‌ పొలాక్‌ మాట్లాడుతూ... 'మేము క్రికెట్‌ ఆడేటప్పుడు సచిన్‌ టెండూల్కర్‌ను ఔట్‌ చేయడానికి దక్షిణాఫ్రికా జట్టు ఎలాంటి ప్రణాళికలు రూపొందిచేది కాదు. సచిన్‌ తప్పు చేసేంతవరకూ ఎదురుచూసే వాళ్లం. ఆలా చేయడం తప్పితే మరో మార్గం ఉండేది కాదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ దిట్ట. చాలా త్వరగా ఆటను అర్థం చేసుకుంటాడు. అతడికి సంధించే షార్ట్‌ పిచ్‌ బంతులను కీపర్‌, స్లిప్‌ ఫీల్డర్ల మీదుగా ఆడే షాట్స్‌ అప్పట్లో ఓ వండర్‌ అనుకోవాలి. టెక్నికల్‌గా అతడి బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు. అందుకే ఔట్‌ చేయడం చాలా కష్టంగా అనిపించేది' అని అన్నాడు.

సచిన్‌ టెండూల్కర్‌ వన్డేల్లో షాన్‌ పొలాక్‌ బౌలింగ్‌లో తొమ్మిది సార్లు ఔటయ్యాడు. దీంతో సచిన్‌ను అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్ల జాబితాలో పొలాక్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. లిటిల్‌ మాస్టర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టులలో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేసాడు.

వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ మేఖేల్‌ హోల్డింగ్‌ మాట్లాడుతూ... తన సహచర ఆటగాడు, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నాడు. వివ్‌ రిచర్డ్స్‌ ప్రపంచంలో ఏ బౌలర్‌కు బెదరలేదని చెప్పాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌ రిచర్డ్‌ హాడ్లీ, ఆస్ట్రేలియా పేసర్‌ డెన్నిస్‌ లిల్లీ, పాకిస్థాన్‌ బౌలర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌, భారత బౌలర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ, ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఇయాన్‌ బోథమ్‌పై విండీస్‌ దిగ్గజం ఆధిపత్యం చెలాయించాడని మైఖేల్‌ గుర్తుచేసుకున్నాడు. రిచర్డ్స్‌.. లాంటి భయం లేకుండా తలకు హెల్మెట్‌ లేకుండానే బ్యాటింగ్‌కు దిగి బౌలర్లపై విరుచుకుపడేవాడు.

Story first published: Tuesday, April 14, 2020, 15:05 [IST]
Other articles published on Apr 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+