Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షార్ట్‌ పిచ్‌ బంతులను సచిన్‌ ఆడలేకపోయాడు: పొలాక్‌

Shaun Pollock says Sachin told me he couldnt take on short-pitched deliveries in Australia

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడని దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ షాన్‌ పొలాక్‌ అన్నాడు. ఆస్ట్రేలియాలో షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడం కష్టంగా ఉందని ఒకప్పుడు సచిన్‌ తనతో చెప్పాడన్నాడు. వికెట్‌కీపర్‌, స్లిప్‌ వలయం మీదుగా షాట్లు ఆడడం ద్వారా సచిన్‌ ఆ ఇబ్బందిని అధిగమించాడని పొలాక్‌ తెలిపాడు.

తాజాగా స్కైస్పోర్ట్స్‌తో షాన్‌ పొలాక్‌ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా పర్యటనలో షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కోవడంలో తన ఇబ్బంది గురించి సచిన్‌ ఓసారి నాతో చెప్పాడు. అయితే వికెట్‌కీపర్‌, స్లిప్‌ మీదుగా ర్యాంప్‌ షాట్లు ఆడడం ద్వారా అతడు ఆ సమస్యను అధిగమించాడు' అని తెలిపాడు. పొలాక్‌ దక్షిణాఫ్రికా తరఫున 108 టెస్టులు, 303 వన్డేలు, 12 టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టులలో 421, వన్డేల్లో 393, టీ20ల్లో 15 వికెట్లు తీసాడు. అలానే 3781, 3519, 86 పరుగులు చేసాడు.

అప్పట్లో ఉపఖండంలో సచిన్‌ను ఔట్‌ చేయడం చాలా కష్టంగా ఉండేదని, అతడు తప్పు చేసి ఔటవుతాడని ఆశించేవాళ్లమని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్‌ పొలాక్‌ అన్నాడు. 'మేము క్రికెట్‌ ఆడేటప్పుడు సచిన్‌ టెండూల్కర్‌ను ఔట్‌ చేయడానికి దక్షిణాఫ్రికా జట్టు ఎలాంటి ప్రణాళికలు రూపొందిచేది కాదు. సచిన్‌ తప్పు చేసేంతవరకూ ఎదురుచూసే వాళ్లం. ఆలా చేయడం తప్పితే మరో మార్గం ఉండేది కాదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ దిట్ట. చాలా త్వరగా ఆటను అర్థం చేసుకుంటాడు' అని పొలాక్‌ పేర్కొన్నాడు.

సచిన్‌ టెండూల్కర్‌ వన్డేల్లో షాన్‌ పొలాక్‌ బౌలింగ్‌లో తొమ్మిది సార్లు ఔటయ్యాడు. దీంతో సచిన్‌ను అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బౌలర్ల జాబితాలో పొలాక్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. లిటిల్‌ మాస్టర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టులలో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేసాడు. వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు.

Story first published: Friday, April 17, 2020, 12:41 [IST]
Other articles published on Apr 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+