న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తాహిర్‌కు అరుదైన గిఫ్ట్‌గా పురుగును అందించిన షాన్ పొలాక్‌

Shaun Pollock places ladybug on Imran Tahirs shoulder for good luck

లార్డ్స్‌: ద‌క్షిణాఫ్రికా వెట‌ర‌న్ లెగ్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన బ‌హుమ‌తిని అందుకున్నారు. ఈ బ‌హుమ‌తిని అంద‌జేసింది కూడా ద‌క్షిణాఫ్రికా లెజెండ‌రీ ఫాస్ట్ బౌల‌ర్‌, ఆ జ‌ట్టు మాజీ కేప్టెన్ షాన్ పొలాక్‌. ఓ పురుగు లేడీబ‌గ్‌ను ఇమ్రాన్ తాహిర్‌కు గిఫ్ట్‌గా అందజేశాడు షాన్ పొలాక్‌. ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా.. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

బౌల‌ర్.. లేబ‌ర్‌లాంటోడు: బౌలింగ్ చేయాల‌ని ఎవ‌రూ కోరుకోరుబౌల‌ర్.. లేబ‌ర్‌లాంటోడు: బౌలింగ్ చేయాల‌ని ఎవ‌రూ కోరుకోరు

పురుగును బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం వెనుక ఓ చిన్న క‌థ ఉంది. ప్ర‌పంచ‌క‌ప్‌లో టోర్న‌మెంట్‌లో భాగంగా లార్డ్స్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్ తాహిర్ రెండు కీల‌క వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ఓపెన‌ర్లు ఫ‌క‌ర్ జ‌మాన్‌, ఇమాముల్ హ‌క్‌ల‌ను త‌న స్పిన్ మాయాజాలంతో పెవిలియ‌న్‌కు పంపించాడు. ఈ రెండు వికెట్ల తీసుకోవ‌డంతో మైలురాయిని అందుకున్నాడు.

Shaun Pollock places ladybug on Imran Tahirs shoulder for good luck

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ద‌క్షిణాఫ్రికా తర‌ఫున అత్య‌ధికంగా వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా ఇమ్రాన్ తాహిర్ ఆవిర్భ‌వించారు. ఇదివ‌ర‌కు ఈ రికార్డు ఆ దేశ ఫాస్ట్ బౌల‌ర్ అలెన్ డొనాల్డ్ పేరు మీద ఉండేది. దీన్ని తాహిర్ బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ సంద‌ర్భంగా పాకిస్తాన్ ఇన్నింగ్ ముగిసిన త‌రువాత‌.. షాన్ పొలాక్ గ్రౌండ్‌పైకి వ‌చ్చారు. ఇమ్రాన్ తాహిర్‌ను ప్ర‌శంసించాడు.

అనంత‌రం గ్రౌండ్‌లో ప‌చ్చిక‌పై క‌నిపించిన లేడీ బ‌గ్ పురుగును తీసుకుని.. తాహిర్ భుజాల‌పై పెట్టాడు. లేడీ బ‌గ్‌ను అదృష్టానికి ప్ర‌తీక‌గా భావిస్తారు ద‌క్షిణాఫ్రిక‌న్లు. అందుకే- షాన్ పొలాక్ దాన్ని బ‌హుమ‌తిగా తాహిర్‌కు అంద‌జేశాడ‌ని అంటున్నారు. భ‌విష్య‌త్తులో ఆడ‌బోయే మ్యాచ్‌ల‌ల్లో తాహిర్‌కు అదృష్టం క‌లిసి రావాల‌ని కోరుకుంటున్నాన‌ని షాన్ పొలాక్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

Story first published: Monday, June 24, 2019, 15:01 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X