For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధావన్ లంచ్‌కు ముందు సెంచరీ.. మూడో టెస్టులో విజయం?'

Shashi Tharoor Shocked By Indias Lords Debacle, Dreams Of Sensational Comeback

హైదరాబాద్: తొలి టెస్టు ఫలితం అటుంచితే.. రెండో టెస్టులో దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది టీమిండియా. ఇప్పటికే 0-2తో టెస్టు సిరీస్ ఫలితాన్ని మోస్తుంది భారత్. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా మిగిలిన మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తుంది. ధావన్ లంచ్‌కు ముందే సెంచరీ చేస్తాడని.. కుల్దీప్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు మాయాజాలం చూపిస్తాడని.. చతేశ్వర్ పూజారా మిగిలిన 5రోజుల పాటు బ్యాటింగ్ చేస్తూనే ఉంటాడని ఓ ప్రముఖ రాజకీయ నేత ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Shashi Tharoor Shocked By Indias Lords Debacle, Dreams Of Sensational Comeback

దేశ రాజకీయాలపై ఎప్పటికప్పుడు ట్వీట్‌ల ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండే కాంగ్రెస్ నేత శశి థరూర్.. తాజాగా లార్డ్స్‌లో టీమిండియా ఓటమిపై స్పందించారు. ఇదో పీడకల అని, దీని నుంచి టీమ్ మళ్లీ మేలుకుంటుందన్న ఆశాభావాన్ని థరూర్ వ్యక్తంచేశారు. 1974 తర్వాత లార్డ్స్‌లో అత్యంత దారుణంగా ఓడిన చెత్త రికార్డును టీమిండియా మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓడిపోవడంపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ఫైట్ లేకుండా చేతులెత్తేశారు.

1
42375

తొలి ఇన్నింగ్స్‌లో 107, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌటయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో థరూర్ చేసిన మరో ట్వీట్ నెటిజన్లలో ఆసక్తి రేపుతుంది. 1936-37 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా టీమ్ 0-2తో వెనుకబడి 3-2తో సిరీస్ గెలిచిన సందర్భాన్ని థరూర్ గుర్తు చేశారు. అదే మరోసారి రిపీట్ కావాలని తాను కలలు కంటున్నట్లు చెప్పారు. లంచ్‌లోపే ధావన్ సెంచరీ కొట్టాలి. కుల్‌దీప్ యాదవ్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను తిప్పేయాలి. రిషబ్ పంత్ తొలి టెస్ట్‌లోనే సెంచరీ కొట్టాలి.. మొత్తంగా టీమ్ అద్భుతమే చేయాలంటూ థరూర్ ట్వీట్ చేశారు.

వచ్చే శనివారం నుంచి ఈ రెండు టీమ్స్ మధ్య మూడో టెస్ట్ మొదలవనుంది. ఈ మ్యాచ్‌కల్లా తాను పూర్తి స్థాయిలో కోలుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. రెండో టెస్టు జరుగుతున్న సమయంలోనే వెన్నునొప్పి కారణంగా ఫీల్డింగ్‌లోనూ.. బ్యాటింగ్‌లోనూ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. టీమిండియా కోహ్లీపైనే ఆశలు నిలుపుకోవడంతో మరో టెస్టుకు కోహ్లీ ఆరోగ్యంపైనే ఫలితం ఆధారపడి ఉంది.

Story first published: Monday, August 13, 2018, 13:48 [IST]
Other articles published on Aug 13, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+