ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ రాజీనామా: ట్విట్టర్ బేజారు
హైదరాబాద్: ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 59 ఏళ్ల మనోహర్ కేవలం ఎనిమిది నెలలు ఆ పదవిలో ఉండి బుధవారం ఊహించని విధంగా ఐసీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే అధికారికంగా ఇంకా దానిని ఆమోదించలేదని ఓ ఐసీసీ అధికారి వెల్లడించారు. ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్‌కు శశాంక్ తన రాజీనామా లేఖను పంపించారని తెలిపారు. శ్రీనివాసన్ నుంచి శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ ఛైర్మన్‌గా మే, 2016న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై ఈ పదవి చేపట్టిన తొలి ఇండిపెండెంట్ చైర్మన్‌గా నిలిచారు. స్వతహాగా లాయర్ అయిన శశాంక్ మనోహర్ గతంలో రెండుసార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు.
అనంతరం ఆయన ఐసీసీ ఛైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజానికి ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటూ కొనసాగాల్సి ఉంది. అయితే ఏడాది కూడా ముగియకుండానే ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
గత కొద్ది రోజులుగా బీసీసీఐ, ఐసీసీకి మధ్య విభేదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శశాంక్ మనోహర్ రాజీనామాపై క్రికెట్ వరల్డ్ ఆశ్చర్యానికి గురైంది. అయితే ఇంత సడన్‌గా శశాంక్ తప్పుకోవడంపై క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.
హర్షా బోగ్లే
ఐసీసీ ఛైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ బుధవారం రాజీనామా చేశారు. శశాంక్ మనోహర్ రాజీనామాపై ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే ఇలా అన్నారు.
వ్యక్తిగత కారణాలతో
వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు శశాంక్ మనోహర్ బుధవారం ప్రకటించారు. అయితే అధికారికంగా ఇంకా దానిని ఆమోదించలేదని ఓ ఐసీసీ అధికారి వెల్లడించారు.
క్రికెట్ అనలిస్ట్ అజయ్ మీనన్
ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ అజయ్ మీనన్ ఇలా
క్రికెట్ అనలిస్ట్ శేఖర్ గుప్తా
ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ శేఖర్ గుప్తా ఇలా
బీబీసీ జర్నలిస్ట్ ఇలా
శశాంక్ మనోహర్ రాజీమానాపై బీబీసీ జర్నలిస్ట్ ఇలా
క్రికెట్ అభిమాని
శశాంక్ మనోహర్ రాజీమానాపై క్రికెట్ అభిమాని ఇలా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications