IPL 2021కు వేళాయే.. యూఏఈ పిచ్‌లు ఎవరికి సహకరించనున్నాయంటే? ఆ మైదానంలో బ్యాట్స్‌మన్‌కు పండగే!

IPL 2021 : UAE Pitch Report | Sharjah, Dubai, Abu Dhabi | CSK VS MI || Oneindia Telugu

హైదరాబాద్: కరోనా కారణంగా ఈ ఏడాది మేలో అర్ధంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సందడి మళ్లీ షూరూ కాబోతుంది. ఆదివారం (సెప్టెంబర్ 19) ఐపీఎల్ రెండో దశ మ్యాచులు ఆరంభం కానున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే రెండో దశకు ప్రేక్షకులను అనుమతించడంతో రెట్టింపు మజా ఖాయం. మరోవైపు ఐపీఎల్‌ ముగిశాక.. ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌నకు ఒమన్‌తో పాటు యూఏఈ కూడా ఆతిథ్యమిస్తుంది. ఈ నేపథ్యంలో యూఏఈలోని స్టేడియాలు.. అందులోని పిచ్‌లపై చర్చ జోరుగా సాగుతోంది. ఓసారి యూఏఈ పిచ్‌ల విశేషాలను చూద్దాం.

Team India Head Coach: ఆ ముగ్గురిలో​ ఒకరే టీమిండియా కొత్త కోచ్‌.. రేసులో హైదరాబాద్ క్రికెటర్!!Team India Head Coach: ఆ ముగ్గురిలో​ ఒకరే టీమిండియా కొత్త కోచ్‌.. రేసులో హైదరాబాద్ క్రికెటర్!!

సిద్ధమైన యూఏఈ మైదానాలు:

సిద్ధమైన యూఏఈ మైదానాలు:

గతేడాది ఐపీఎల్‌ పూర్తిగా యూఏఈలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. అబుదాబి, షార్జా, దుబాయ్‌ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు కూడా భారత్‌లో కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 2021 రెండో దశ మ్యాచ్‌లకు ఈ మూడు స్టేడియాల్లోనే జరుగనున్నాయి. రెండు దశలో 31 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత ఒమన్‌తో కలిసి యూఏఈ.. టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వనుంది. ఈ పొట్టి కప్పులో భాగంగా యూఏఈలో కనీసం 36 మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పిచ్‌లు, వాతావరణంపై అందరి దృష్టి పడింది. రెండు నెలల వ్యవధిలో మూడు స్టేడియాల్లో కనీసం 65 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. దాంతో మ్యాచ్‌లు సాగేకొద్దీ పిచ్‌లు నెమ్మదించే ఆస్కారం ఉంది.

 స్పిన్నర్లకు పండగే:

స్పిన్నర్లకు పండగే:

అలా కాకుండా ఎప్పటికప్పుడు అక్కడి పిచ్‌లో జీవాన్ని నింపడం కష్టంతో కూడుకున్న పని. మొదట్లో పేసర్లకు అనుకూలంగానే ఉండే యూఏఈ పిచ్‌లు టీ20 ప్రపంచకప్‌ 2021 సమయానికి స్పిన్నర్లకు సహకరించేలా మారతాయనే అంచనాలున్నాయి. దీంతో గింగిరాలు తిరిగే బంతులను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు సవాలుగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఈ పిచ్‌లపై మ్యాచ్‌లాడడం.. వివిధ దేశాల ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్‌ అని చెప్పొచ్చు. వాళ్లకు ఇక్కడి పిచ్‌లపై మంచి అవగాహన వస్తుందనేది కాదనలేని నిజం. అయితే వేడి ఉష్ణోగ్రత, తేమతో కూడిన వాతావరణం ఆటగాళ్లకు సవాలుగా మారనుంది. ముఖ్యంగా అక్కడి ఉష్ణోగ్రతలను తట్టుకోవడం చాలా కష్టం.

 అబుదాబి:

అబుదాబి:

సెప్టెంబర్‌ నెలలో అబుదాబిలో సుమారు 40 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉష్ణోగ్రత ఉండనుంది. దీంతో ఎండ, ఉక్కపోత అధికంగానే ఉంటాయి. ఆటగాళ్లు శ్రమించక తప్పదు. సరైన ఫిట్‌నెస్‌ లేకుంటే అంతే సంగతులు. గత సీజన్‌లో అబుదాబి స్టేడియంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 8 మ్యాచ్‌ల్లో, ఛేదన చేసిన జట్లు 12 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. తొలి, రెండో ఇన్నింగ్స్‌ల సగటు స్కోర్లు 140, 129. ఇక్కడ ఇటీవల ముగిసిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో పేసర్లదే హవా. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఈ మైదానంలో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు 196 కాగా.. అత్యల్ప స్కోరు 84.

షార్జా:

షార్జా:

ఐపీఎల్ 2021 సమయంలో షార్జాలో 40 నుంచి 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దుబాయ్, అబుదాబితో పోల్చుకుంటే ఈ స్టేడియం చిన్నది కావడం ఫీల్డర్లకు ఉపశమనాన్ని కలిగించేదే. ఇక్కడ బౌండరీల మోత ఖాయం. దాంతో వారు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. ఇక బ్యాట్స్‌మన్‌కు పండగే. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇక్కడ గతేడాది ఐపీఎల్‌లో ఛేదన చేసిన జట్లు 7 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 5 విజయాలు సాధించాయి. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 149. కాగా.. రెండో ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 131 మాత్రమే. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఈ స్టేడియంలో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోర్ 228, అత్యల్ప స్కోర్లు 112.

దుబాయ్ :

దుబాయ్ :

అబుదాబి, షార్జా కంటే దుబాయ్ నగరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. 42 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉంది. దుబాయ్ స్టేడియంలో ఛేదన చేసిన జట్లే ఎక్కువ విజయాలు అందుకున్నాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 9 మ్యాచ్‌ల్లో గెలవగా.. రెండో సారి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 144 కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 122గా ఉంది. దుబాయ్‌ స్టేడియంలో గత ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు 219 కాగా అత్యల్ప స్కోరు 109.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, September 18, 2021, 11:30 [IST]
Other articles published on Sep 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X