'ధోని బలహీనతలను ఆసీస్‌తో పంచుకోవాల్సినంత అవసరం లేదు"

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్‌లో పెద్దగా బలహీనతలేమీ లేవని.... ఒకవేళ ఉన్నా వాటిని తాను ఆసీస్‌తో పంచుకోవాల్సినంత అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వెల్లడించాడు. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా ఆదివారం టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రత్యర్థి జట్లు ఇప్పటికే వ్యూహాలతో
ప్రతి ఆటగాడి గురించి ప్రత్యర్థి జట్లు ఇప్పటికే వ్యూహాలతో సిద్ధంగా ఉండే ఉంటాయి. అయితే, ధోని కోసం ఎన్ని వ్యూహాలు రచించినా అవన్నీ విఫలమవడం ఖాయమని మైక్ హస్సీ పేర్కొన్నాడు. ప్రతీ మ్యాచ్‌లో ధోని పక్కా ప్రణాళికతో బ్యాటింగ్‌కు దిగడని, పరిస్థితులను బట్టి తన ఆటతీరును మార్చుకుంటాడని మైక్ హస్సీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ధోని గురించి మాట్లాడుతూ
ధోని గురించి మాట్లాడుతూ "ధోని బ్యాటింగ్‌లో చాలా తక్కువ బలహీనతలు ఉన్నాయి. వాటిని ఆసీస్‌తో సహా ఎవరికి చెప్పను. తన బలాలు, బలహీనతలు ఏంటో ధోనికి తెలుసు. పరిస్థితి ఎలాంటిదైనా, ఒత్తిడిలో ఉన్నా లేకున్నా దానిని తనకు అనుకూలంగా మార్చుకోనే సత్తా ధోనీ సొంతం. ప్రతీ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బ్యాటింగ్‌కు దిగడు" అని హస్సీ అన్నాడు.

తన ఆటతీరును మార్చుకుని భాద్యతతో
"మ్యాచ్‌లో జట్టు అవసరాలు, పరిస్థితుల ప్రకారం తన ఆటతీరును మార్చుకుని భాద్యతతో ఆడతాడు. ఇక్కడ అతని వయస్సు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలో బరిలోకి దిగినా గొప్ప ఫినిషర్‌గా ఎంతో బాధ్యతతో చాలా ఇన్నింగ్‌లాడాడు. ఆసీస్ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆసీస్‌పై అఫ్గానిస్తాన్ పోరాటం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది" అని హస్సీ అన్నాడు.

అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రా
ఇక, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రా గురించి మాట్లాడుతూ "ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా బుమ్రా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుతం అతనిపై ఎంత ఒత్తిడి ఉన్నా దానిని గొప్పగా అధిగమించి మంచి ఫలితాలు రాబట్టగలడు" అని హస్సీ తెలిపాడు. హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ప్రమాదకరంగా కనిపిస్తున్నాడని హస్సీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications