మెరిసిన శార్దుల్, సుందర్, నటరాజన్.. ఆస్ట్రేలియా ఆలౌట్!!

బ్రిస్బేన్: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. 274/5 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండోరోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. మరో 95 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. టిమ్ పైన్ (50; 104 బంతుల్లో 6x4), కామెరూన్ గ్రీన్ (47; 107 బంతుల్లో 6x4) రాణించారు. తొలి రోజు ఆటలో మార్నస్ లబుషేన్ (108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్ మూడేసి వికెట్లు తీశారు.

పైన్ హాఫ్ సెంచరీ:
శనివారం ఉదయం 274/5 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆసీస్ కొనసాగించింది. టీ నటరాజన్ వేసిన ఈ రోజటి మొదటి ఓవర్లోనే కామెరాన్ గ్రీన్ రెండు ఫోర్లు బాదాడు. ఆపై టిమ్ పైన్ కూడా చెత్తబంతులకు మాత్రమే బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. ఈ క్రమంలోనే పైన్ హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిది 9వ అర్ధ శతకం. అయితే శార్దుల్ ఠాకుర్ వేసిన 100వ ఓవర్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కి పైన్ ఔట్ అయ్యాడు.

4 పరుగుల తేడాలో మూడు వికెట్లు:
ఆ తర్వాత ఓవర్‌లో కామెరూన్ గ్రీన్ కూడా (47; 107 బంతుల్లో 6x4) ఔటయ్యాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. గ్రీన్, పైన్ ఇద్దరూ ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించాడు. ఇక శార్దుల్ వేసిన మరుసటి ఓవర్‌లో పాట్ కమిన్స్ (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆసీస్ 4 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. సుందర్, ఠాకుర్ బౌలింగ్‌ను టార్గెట్ చేసుకుని బౌండరీలు బాదారు. దీంతో ఆసీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

ధాటిగా ఆడిన లైయన్:
నాథన్ లైయన్ (24; 22 బంతుల్లో 4x4), మిచెల్ స్టార్క్ (20 నాటౌట్; 35 బంతుల్లో 1x6) ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 350 దాటించారు. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో లైయన్ బౌల్డయ్యాడు. చివర్లో జోష్ హేజిల్‌వుడ్ (11) కూడా పోరాడటంతో ఆస్ట్రేలియా 369 పరుగులు చేసింది. సిరాజ్ బౌలింగ్‌లో రెండు చూడచక్కటి కవర్‌డ్రైవ్‌లు ఆడాడు. ఇన్నింగ్స్ 116వ ఓవర్ వేసిన నటరాజన్.. హేజిల్‌వుడ్‌ని క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కి తెరదించాడు. అరంగేట్రం బౌలర్లు నటరాజన్, సుందర్‌తో పాటు శార్ధూల్ ఠాకూర్‌కి మూడేసి వికెట్లు దక్కగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
ISL 2020 21: చివరలో నెవిల్లె గోల్.. బెంగాల్, కేరళ మ్యాచ్ డ్రా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications