Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలో పెళ్లిళ్ల సీజన్.. మూడు ముళ్లు వేసిన మరో స్టార్ ప్లేయర్!

Shardul Thakur ties the knot with Mittali Parulkar

టీమిండియాలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లు ఉంది. ఒక్కొక్క ఆటగాడే వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఒకింటి వారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా చేరాడు. మిట్టలి పారూల్కర్‌ను ఠాకూర్ వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

శార్దూల్ ఠాకూర్ వివాహానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా హాజరయ్యారు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడిన శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది కోల్‌కతా తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేకేఆర్ టీం మేనేజ్‌మెంట్‌ సభ్యుడు అభిషేక్ నాయర్ తదితరులు కూడా ఠాకూర్ వివాహ వేడుకలో సందడి చేశారు. ఈ వివాహ వేడుకలో హల్దీ, సంగీత్ వంటి సంప్రదాయ కార్యక్రమాలతోపాటు మోడ్రన్‌గా పూల్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు.

Shardul Thakur ties the knot with Mittali Parulkar

శార్దూల్ ఠాకూర్ అభిమానులు, క్రికెటర్లు ఈ వేడుకకు హాజరై దీనికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నేతృత్వంలో ఠాకూర్, పారూల్కర్ జోడీ కూడా కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ సహా తన స్నేహితులతో శార్దూల్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.

కాగా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తర్వాత జరిగే వన్డే సిరీసులో శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శార్దూల్‌కు కూడా సెలెక్టర్లు చోటిచ్చారు. బంతితో కీలకమైన సమయాల్లో వికెట్లు తీయడంతోపాటు బ్యాటుతో కొన్ని విలువైన పరుగులు చేయడం శార్దూల్ ప్రత్యేకత. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్‌లో అతను కూడా జట్టుకు కీలకం అవుతాడని సెలెక్టర్లు భావిస్తున్నారు.

Story first published: Monday, February 27, 2023, 10:13 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+