Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీంకు కావలసినప్పుడు వికెట్లు తీసే శార్దూల్.. ఆ టెక్నిక్ ఏంటంటే?

భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జట్టుకు అవసరం అయినప్పుడల్లా వికెట్లు తీసుకుంటాడని అతన్ని అంటారు. అందుకే చాలా మంది అతన్ని 'లార్డ్ శార్దూల్' లేదా 'గోల్డెన్ ఆర్మ్' అని పిలుస్తుంటారు. ఇలా తను వికెట్లు ఎలా తీస్తున్నానని తాజాగా శార్దూల్ వెల్లడించాడు.

తాను ఎప్పుడూ వికెట్లు తీయడానికే ప్రయత్నిస్తానని, అందుకే సక్సెస్ దక్కుతోందని చెప్పాడు. వరల్డ్ కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్న ప్లేయర్లలో శార్దూల్ ఒకడు. వన్డే ఫార్మాట్‌లో అతని గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. బంతితో కీలకమైన సమయంలో భాగస్వామ్యాలు విడగొట్టం, బ్యాటుతో మెరుపు ఇన్నింగ్సులు ఆడటం అతనికి అలవాడు.

Shardul Thakur

ఈ క్రమంలో అతని బౌలింగ్ ఎప్రోచ్ గురించి శార్దూల్‌ను ప్రశ్నించారు. 'నేను ఎప్పుడూ వికెట్లు తీసుకోవడం గురించే ఆలోచిస్తుంటా. అది మొదటి ఓవర్ అయినా, చివరి ఓవర్ అయినా.. నా టార్గెట్ వికెట్ తీసుకోవడమే. వికెట్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాయని నా నమ్మకం. ఈ ప్రక్రియలో బౌండరీలు ఇచ్చినా పెద్దగా పట్టించుకోను' అని శార్దూల్ చెప్పుకొచ్చాడు.

తను వికెట్లు తీసుకుంటే మిగతా బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుందని అన్నాడు. 'జట్టులో ప్రతి ఒక్కరికీ ఒక పాత్ర ఉంటుంది. ప్రస్తుతం నా పాత్ర ఏంటంటే.. వికెట్లు తీసుకునే బౌలర్' అని తెలియజేశాడు. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో శార్దూల్ చక్కగా రాణించాడు. సీనియర్ బౌలర్ల గైర్హాజరీలో బౌలింగ్ విభాగం భారాన్ని రాయడంపై కూడా సంతోషం వ్యక్తం చేశాడు.

'వన్డేల్లో నేను ప్రస్తుతం బౌలింగ్ చేస్తున్న విధానం సంతోషకరంగా ఉంది. ఈ ఫార్మాట్ ఎప్పటికప్పుడు పరిణితి చెందుతూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా మన బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకోవాల్సి ఉంటుంది. విండీస్ టూర్‌లో నేను రాణించింనందుకు సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.

కొన్ని రోజుల క్రితం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టులో శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఒక హాఫ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఐసీసీ ట్రోఫీ నెగ్గాలనే భారత కల మరింత దూరం జరిగింది.

Story first published: Tuesday, August 15, 2023, 18:15 [IST]
Other articles published on Aug 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+