న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలోకి బుమ్రా స్థానంలోకి శార్దూల్..!!

Shardul Thakur replaces injured Jasprit Bumrah in the India ODI squad

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. వేలికి గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20, వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రా స్థానంలో వన్డేలకు శార్దుల్ ఠాకూర్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 24ఏళ్ల ముంబై బౌలర్ బుమ్రా వేలికి గాయమవడంతో.. శస్త్ర చికిత్స జరిగింది.

కాగా, దీంతో అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించడంతో అతనికి బదులుగా వేరే క్రికెటర్‌ను తీసుకోవాల్సిన అవసరపడింది. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు శార్దూల్ పేరు చేర్చి 16 మంది ప్రాబబుల్స్ జాబితాతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. వన్డేల్లోకి బుమ్రా స్థానంలో శార్దుల్‌ను తీసుకున్న క్రికెట్ బోర్డ్, టీ20ల్లో దీపక్ చాహర్‌ను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది.

అతను కోలుకున్న వెంటనే మ్యాచ్ ఆడేందుకు తగిన సమయం కావాలని అందుకోసమే జూలై 12వరకూ ఆగాల్సి వస్తుందని బోర్డు అధికారి తెలిపారు. ఒకవేళ వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులోకి రాకపోతే.. టెస్టు సిరీస్ ప్రారంభమయ్యేలోగా అతడు కోలుకుంటాడని బీసీసీఐ ఆశిస్తోంది. ఇంగ్లాండ్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆగష్టు1న బిర్మింగ్‌హమ్ వేదికగా ఆరంభం కానుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకుల్లో బౌలర్‌గా బుమ్రా నం.1 స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగనున్న భారత జట్టు(అంచనా):
Virat Kohli (Captain), Shikhar Dhawan, Rohit Sharma, KL Rahul, Shreyas Iyer, Suresh Raina, MS Dhoni (wicket-keeper), Dinesh Karthik, Yuzvendra Chahal, Kuldeep Yadav, Axar Patel, Bhuvneshwar Kumar, Shardul Thakur, Hardik Pandya, Siddarth Kaul, Umesh Yadav.

Story first published: Tuesday, July 17, 2018, 16:47 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X