Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: కేకేఆర్‌పై శార్దూల్ ఠాకూర్ సెంచరీ!.. సత్కరించిన జహీర్‍ఖాన్!!

Shardul Thakur: లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా తన ఐపీఎల్ కెరీర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తన 100వ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు శార్దూల్ ఠాకూల్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చేతుల మీదుగా 100 నంబర్ గల ప్రత్యేక జెర్సీని అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

శార్దూల్ ఠాకూర్ ఇప్పటివరకు ఆరు వేర్వేరు ఐపీఎల్ జట్లకు ఆడాడు. వీటిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్(ఇప్పుడు పంజాబ్ కింగ్స్), రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. తన 100వ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అతని కోచ్, మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అతనికి ప్రత్యేక జ్ఞాపికను అందజేయడం గమనార్హం.

Shardul Thakur marked his 100th IPL match and get Special Jersey for Zaheer Khan

వేలంలో అమ్ముడుపోకపోయినా..

వాస్తవానికి ఐపీఎల్ 2025 వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోలేదు. రూ. కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ బ్యాకప్ పేసర్‌గా శార్దూల్‌ను తీసుకుంది. లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ కు గాయం కావడంతో అతడి స్థానంలో శార్దూల్ ను జట్టులోకి తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని తనను తాను నిరూపించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 34 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ కెరీర్ లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ తన జట్టు లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధించడంలో సహాయపడ్డాడు. ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రయాణం ఇప్పటివరకు ఒడిదుడుకులతో నిండి ఉంది. కానీ శార్దూల్ ఠాకూర్ ఫామ్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.

Story first published: Tuesday, April 8, 2025, 18:29 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+