నన్ను నిక్ నేమ్స్ పెట్టి పిలిస్తే వాళ్లకు నా మీద ఎంత ఇష్టముందో అర్థమవుతుంది : శార్దూల్ ఠాకూర్

భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు 'లార్డ్' 'బీఫీ' (సర్ ఇయాన్ బోథమ్‌ను సూచించేలా) నిక్ నేమ్స్ తన సహచరులు పెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది వేసవిలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఇదే టెస్ట్ సిరీస్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణించిన శార్దూల్ ఠాకూర్‌కు తోటి టీమిండియా ప్లేయర్లు ఈ నిక్ నేమ్స్ ఇచ్చారు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే ఐదో టెస్ట్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు.
ఠాకూర్ తాను అరంగేట్రం చేసినప్పటి నుంచి విదేశీ పర్యటనలలో భారత టెస్ట్ జట్టు తరఫున చాలా మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇక ఇంగ్లాండ్‌తో ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 57హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 60పరుగులు చేసి జట్టు స్కోరు 466కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ మ్యాచ్‌లో 157పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
ఇంగ్లాండ్ బౌలర్లకు స్వర్గధామం
ఇటీవల bcci.tv పోస్ట్ చేసిన వీడియోలో తన ఇంటర్వ్యూ సందర్భంగా శార్దూల్ మాట్లాడుతూ.. 'ఇంగ్లాండ్ స్టేడియాలు బౌలర్లకు స్వర్గధామాల్లాంటివి. ఇక్కడ బంతి మంచి స్వింగ్ అవుతుంది. మీరు ఒకే స్పెల్‌లో చాలా వికెట్లు తీయొచ్చు. క్రికెట్ ఆడటానికి నాకు ఇష్టమైన విదేశాల్లో ఇంగ్లాండ్ ఒకటి. ఇక నా నిక్ నేమ్స్ విషయానికి వస్తే.. నన్ను ఏ పేరుతో పిలిచినా హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటా.
నేను రంజీ ట్రోఫీ ఆడే రోజుల్లో నన్ను బుల్ అని పిలిచేవారు. ఇంగ్లాండ్ మీద ప్రదర్శన తర్వాత లార్డ్, బీఫీ అంటూ పేర్కొంటున్నారు. ఇలా నిక్ నేమ్స్ పెట్టి పిలవడం వల్ల నా సహచరులు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుస్తోంది. అలా నన్ను పిలుస్తుంటే వినడానికి కూడా బాగుంది.' అని శార్దూల్ క్రీడాస్ఫూర్తిని చాటాడు.

జట్టులో మంచి పేస్ అటాక్ ఉంది
'జట్టులో మాకు మంచి పేస్ అటాక్ ఉంది. షమీ, బుమ్రా, ఉమేష్‌తో సహా ప్రతి ఒక్కరం అవకాశం దొరికినప్పుడల్లా రాణిస్తున్నాం. కొన్నిసార్లు మా బౌలర్లు వారి మొదటి స్పెల్‌లో 2 లేదా 3 వికెట్లు పడగొట్టి పై చేయి సాధిస్తున్నారు. దాదాపు నేను మిడిల్ ఓవర్లలోనే బౌలింగ్‌కు దిగుతుంటాను. కానీ అలా మిడిల్ ఓవర్ బౌలర్ పాత్రను నేను ప్రస్తుతం ఇష్టపడుతున్నాను. ఏ టైంలో బౌలింగ్ చేయమంటే ఆ టైంలో బౌలింగ్ చేయాలి అది నా కర్తవ్యం, మిడిల్లో నేను నా మంచి ప్రదర్శనను అందిస్తే అది మ్యాచ్‌పై తప్పకుండా ప్రభావం చూపుతుందని నాకు తెలుసు' అని శార్దూల్ చెప్పాడు.

ఇంగ్లాండ్‌తో 5వ టెస్టు కోసం ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications