సిడ్నీ టెస్టులో అనూహ్య ఘటన.. రవిశాస్త్రి సందేశాన్ని క్రీజులోని బ్యాట్స్‌మెన్‌కు చెప్పని శార్దూల్!!

Shardul Thakur Happy For Mohammed Siraj After His 5 Wicket Haul In Gabba Test | Oneindia Telugu

ముంబై:‌ బోర్డర్‌-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమిండియా 'డ్రా' చేసుకున్నవిషయం తెలిసిందే. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (39 నాటౌట్‌; 128 బంతుల్లో 7×4), హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారి (23 నాటౌట్‌; 161 బంతుల్లో 4×4) అద్భుతంగా ఆడి భారత్‌ను ఓటమి నుంచి బయటపడేశారు. రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు 259 బంతులాడి కేవలం 62 పరుగులు చేశారు. వీరి దూర్బేధ్యమైన డిఫెన్స్‌ను ఆసీస్ బౌలర్లు కమిన్స్, స్టార్క్, హేజిల్ వుడ్, లైయన్ ఛేదించలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

శాస్త్రి సందేశాన్ని చెప్పని శార్దూల్:

శాస్త్రి సందేశాన్ని చెప్పని శార్దూల్:

అయితే ఐదవ రోజు ఆటలో ఆర్ అశ్విన్‌, హనుమ విహారి మాత్రమే కీలకం కాదని.. శార్దూల్‌ ఠాకుర్‌ కూడా అంతే ముఖ్య పాత్ర పోషించాడని తాజాగా తెలిసింది. సిడ్నీ టెస్టు చివరి రోజు అశ్విన్‌‌, విహారి బ్యాటింగ్‌ చేస్తుండగా టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి.. శార్దూల్‌ ద్వారా వారికి ఒక సందేశం పంపాడని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అన్నారు. తాజాగా అశ్విన్‌‌తో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర విషయం బయటకు చెప్పారు. అయితే ఆ సందేశం ఏంటో శార్దూల్‌ తమకు (అశ్విన్‌, విహారి) చెప్పలేదని అశ్విన్‌ తెలిపాడు.

ఇలాగే ఆడండని చెప్పాడు:

ఇలాగే ఆడండని చెప్పాడు:

'ఐదవ రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. కోచ్ రవిశాస్త్రి.. శార్దూల్‌ను పిలిచి విహారిని ధాటిగా ఆడమని, మరో ఎండ్‌లో అశ్విన్‌ను వికెట్‌ కాపాడుకోమని చెప్పమన్నారు' అని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్ తెలిపారు. 'శార్దూల్‌ మా వద్దకొచ్చి.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా విషయాలు చెప్పమని చెప్పారు. కానీ ఇప్పుడు నేనేం చెప్పను. అవన్నీ వదిలేయండి. మీరు ప్రస్తుతం బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడండి' అని చెప్పాడని ఆర్ అశ్విన్‌ స్పష్టం చేశాడు. రవిశాస్త్రి చెప్పిన విషయం చెప్పకుండా.. తాను ఎదనుకున్నాడో ఆ విషయం చెప్పాడు శార్దూల్. ఏదేమైనా మనకు మంచే జరిగింది.

బ్రో వెళ్లొద్దు:

బ్రో వెళ్లొద్దు:

అడిలైడ్ టెస్ట్ ఓడిపోయిన త‌ర్వాత ఏం జ‌రిగిందో ఆర్ అశ్విన్ త‌న యూట్యూబ్ చానెల్‌లో తాజాగా చెప్పాడు. ఇదే షోలో ఆర్ శ్రీధ‌ర్ కూడా ఉన్నాడు. 'అడిలైడ్ టెస్ట్ త‌ర్వాత విరాట్ కోహ్లీ టీమ్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. బాయ్స్‌, నేను ఇంటికి వెళ్లిపోతున్నాను అని చెప్పాడు. అదొక కాలేజ్ ఫేర్‌వెల్‌లాగా అనిపించింది. ఆ స‌మ‌యంలో బ్రో వెళ్లొద్దు. మ‌నం కొద్దిసేప‌టి కింద‌టే 36 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యాం' అని తన మ‌న‌సులో అనుకున్నాన‌ని అశ్విన్ చెప్పాడు.

మిష‌న్ మెల్‌బోర్న్:

మిష‌న్ మెల్‌బోర్న్:

ఆ రోజు అర్ధ‌రాత్రి జ‌రిగిన ఘ‌ట‌న గురించి శ్రీధ‌ర్ కూడా వెల్ల‌డించాడు. 'అడిలైడ్ టెస్ట్ ఓడిపోయిన రోజు అర్ధ‌రాత్రి 12.30 గంట‌లు అయింది. ఏం చేస్తున్నావ్ అంటూ విరాట్ కోహ్లీ నాకు మెసేజ్ చేశాడు. ఈ స‌మ‌యంలో ఎందుకు మెసేజ్ చేశాడో అని నేను అనుకున్నాను. హెడ్ కోచ్‌, నేను, భ‌ర‌త్ అరుణ్‌, విక్ర‌మ్ రాథోడ్ క‌లిసి ఉన్నామ‌ని చెప్పాను. నేను కూడా వ‌స్తాన‌న్నాడు. ఆ వెంట‌నే కోహ్లీ కూడా వ‌చ్చాడు. అంద‌రం క‌లిసి మాట్లాడుకున్నాం. అప్పుడే మిష‌న్ మెల్‌బోర్న్ మొద‌లైంది' అని శ్రీధర్ వెల్ల‌డించాడు.

పంత్‌ బాగా ఆడినా.. నా కెరీర్‌కు వచ్చిన ప్రమాదం ఏమీలేదు! నా పని నేను చేసుకుంటూ వెళ్తా!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, January 23, 2021, 14:57 [IST]
Other articles published on Jan 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X