గే వ్యాఖ్యలు: గాబ్రియల్‌పై నాలుగు వన్డేల నిషేధం


హైదరాబాద్: వెస్టిండిస్ పేసర్ షానోన్ గాబ్రియల్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నాలుగు వన్డేల నిషేధం విధించింది. సెయింట్ లూసియా వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గాబ్రియల్‌పై ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను గాబ్రియల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధించింది. దీంతో పాటు అతడి మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతతోపాటు 3 డీమెరిట్ పాయింట్లు కూడా చేర్చింది.

గాబ్రియల్ ఖాతాలో మొత్తం 8 డీమెరిట్ పాయింట్లు
దీంతో 24 నెలల్లో గాబ్రియల్ ఖాతాలో మొత్తం 8 డీమెరిట్ పాయింట్లు చేరాయని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మూడో రోజైన సోమవారం కెప్టెన్ జో రూట్‌ను ఉద్దేశించి గాబ్రియల్ ఏమన్నాడో స్టంప్ మైక్‌లో సరిగ్గా వినిపించక పోయినా... ‘గే' గా ఉండటం వల్ల తప్పేంటి? అని జో రూట్ సమాధానం ఇవ్వడం మాత్రం మైక్‌లో రికార్డు అయ్యింది.

గాబ్రియల్‌పై మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు
స్వలింగ సంపర్కీయులను ద్వేషించే విధంగా గాబ్రియల్ స్లెడ్జ్ చేశాడని సమాచారం. దీంతో ఫీల్డ్ అంపైర్లు గాబ్రియల్‌పై మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు చేశారు. మ్యాచ్ అనంతరం గాబ్రియల్ తప్పుచేసినట్టు అంగీకరించడంతో లెవల్-2 కింద అతడిపై చర్యలు తీసుకున్నారు. గాబ్రియల్ ఖాతాలో ఇప్పటికే 5 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.

నవంబర్‌లో మిర్పూర్ టెస్టుకు దూరం
తాజాగా మూడు పాయింట్లతో కలిపి అతడి పాయింట్ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. నిబంధనల ప్రకారం 24 నెలల కాలంలో ఓ ఆటగాడు ఎనిమిది అయోగ్యత పాయింట్లు పొందితే.. అతడిపై 2 టెస్టులు లేదా 4 వన్డేలు లేదా 4 టీ20ల నిషేధం విధించవచ్చు. గతేడాది నవంబరులో గాబ్రియెల్ నాలుగు డీమెరిట్ పాయింట్లు పొందడంతో మిర్పూర్ టెస్టుకు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications