ఆ నిబంధనలు జిమ్మిక్కులు.. అవన్ని ఆటను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు: వాట్సన్

సిడ్నీ: బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2020-21 సీజన్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కొత్త నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సంప్రదాయక నిబంధనలు సడలించిన బీబీఎల్ లీగ్ నిర్వాహకులు అభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు మూడు మార్పులు చేశారు. పవర్ సర్జ్, ఎక్స్-ఫ్యాక్టర్, బాష్ బూస్ట్ అనే మూడు నూతన నిబంధనలను తీసుకువచ్చారు. అభిమానులు, ఆటగాళ్లను మరింత ఉత్సాహ పరిచేందుకే ఈ వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని బీబీఎల్ హెడ్ అలిస్టెయిర్ డాబ్‌సన్ తెలిపాడు. అయితే నూతన నిబంధనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.

ఆటను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు:
నూతన నిబంధనలు జిమ్మిక్కులని, ఆటను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని షేన్ వాట్సన్ విమర్శించాడు. 'బిగ్‌బాష్ లీగ్‌లోని కొత్త జిమ్మిక్కులు పవర్ సర్జ్, ఎక్స్-ఫ్యాక్టర్, బాష్ బూస్ట్ గురించి వివరంగా చదివాను. టోర్నీని ఆకర్షణీయంగా మార్చాలనే క్రమంలో ఆటను తప్పుదారి పట్టించే ప్రయత్నమిది. చక్రం విరగకముందే దాన్ని బాగు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వీక్షకులను పెంచేందుకు చేస్తున్న కొత్త కొత్త ప్రయోగాలివి. వీటిని ప్రాథమిక దశలో ఆటగాళ్లు, కోచ్‌లతో ప్రయత్నించకుండా.. నేరుగా ప్రవేశపెట్టడం నిరాశకు గురిచేసింది' అని తాజాగా వాట్సన్ అన్నాడు.

నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు:
ఇక నూతన నిబంధనలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రనౌట్ కోసం ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించండని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెత్త ఐడియా ఇచ్చిందెవరని మండిపడుతున్నారు. అసలు ఈ రూల్స్ ఏ మాత్రం అర్థం కావడం లేదని, అలాంటిది ఎలా ఉత్సాహ పరుస్తాయని నిలదీస్తున్నారు. ఇంకొందరైతే.. బ్యాట్స్‌మెన్‌ను సొంత అంపైర్లు తెచ్చుకొని ఆడమనండి, వెయ్యి పరుగులు చేయమనండని విమర్శలు చేస్తున్నారు. ఈ చెత్త నిర్ణయాలతో క్రికెట్ ప్రతిష్టను దిగజార్చవద్దని మరికొందరు చురకలంటిస్తున్నారు.

బ్యాటింగ్, బౌలింగ్ చేయొచ్చు:
ఎక్స్-ఫ్యాక్టర్ నిబంధనతో 'సబ్‌స్టిట్యూట్' ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేయొచ్చు. అయితే తొలి 10 ఓవర్లకు పూర్తయ్యాకే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. తుది జట్టులో లేని, డగౌట్‌కే పరిమితమైన ఆటగాడు కూడా ఆడవచ్చు. అలాగే ‘పవర్‌సర్జ్'తో ఇన్నింగ్స్ రెండో అర్ధ భాగంలో బ్యాటింగ్ జట్టు ఏ సమయంలోనైనా రెండు ఓవర్ల పవర్‌ప్లేను తీసుకోవచ్చు. ఈ నిబంధన కోసం ఇన్నింగ్స్ ఆరంభ పవర్‌ప్లేను ఆరు ఓవర్లకు బదులు నాలుగు ఓవర్లకు కుదించారు. పవర్ ప్లే సమయంలో 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.

బోనస్ పాయింట్:
బిగ్ బాష్ లీగ్‌లో మరో కొత్త నిబంధన బాష్ బూస్ట్. ఈ నిబంధనతో జట్టుకు అదనపు పాయింట్ లభించే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌లో తొలి పది ఓవర్లలో ఏ జట్టు అత్యధిక స్కోరు చేస్తుందో.. ఆ జట్టుకు బోనస్‌గా ఓ పాయింట్ కేటాయిస్తారు. అప్పటికి రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉంటే.. తలో అర పాయింటు ఇస్తారు.
కేవలం ఏడు రోజులు.. ఐపీఎల్, పీఎస్ఎల్ టైటిల్స్ గెలిచిన కరేబియన్ క్రికెటర్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications