ఆర్‌సీబీలో ఆ ఏమోషన్ లేదు.. కానీ సీఎస్‌కేలో ఉంది: షేన్ వాట్సన్

IPL 2021: No Real Emotional Connection With RCB But CSK Was Incredible Experience - Shane Watson

సిడ్నీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యాజమాన్యంతో ఎమోషనల్ కనెక్షన్ ఉండేది కాదని, కానీ చెన్నై సూపర్ కింగ్స్‌(సీఎస్‌కే) ఓనర్స్‌తో మాత్రం మంచి అనుబంధం ఉండేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అన్నాడు. తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో ఉన్న అనుబంధాన్ని ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెమరువేసుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున ఏడు సీజన్లు ఆడిన వాట్సన్.. 2018 నుంచి గత సీజన్ వరకు సీఎస్‌కే తరఫున బరిలోకి దిగాడు. 2018 ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ చేసి అద్భుత విజయాన్నందించాడు.

ఆర్‌సీబీలో ఆ ఏమోషన్ లేదు..

ఆర్‌సీబీలో ఆ ఏమోషన్ లేదు..

2019 సీజన్ ఫైనల్లో కూడా రాణించిన వాట్సన్.. విజయం ముంగిట రనౌటయ్యాడు. అయితే గత సీజన్‌లో చెన్నై దారుణ ప్రదర్శనతో లీగ్‌లోనే నిష్క్రమించగా.. ఈ ఆసీస్ ప్లేయర్ ఆటకు అల్విదా ప్రకటించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వాట్సన్.. ఆ తర్వాత ఆర్‌సీబీ, సీఎస్‌కే‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్లలోని తేడాలను చెప్పుకొచ్చాడు. ‘ఆర్‌సీబీ జట్టుతో సాగిన నా ప్రయాణం అద్భుతం. మంచి అనుభవం. ఎందుకంటే వరల్డ్‌క్లాస్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నా. అయితే ఆ జట్టు యాజమాన్యం పూర్తిగా కార్పోరేట్ స్టైల్‌లో ఉంటుంది. ఓనర్స్ ఏమాత్రం ఏమోషనల్ కనెక్షన్ ఉండదు.

 అత్యుత్తమ కోచ్..

అత్యుత్తమ కోచ్..

సీఎస్‌కేతో ఆడటం ఇంక్రీడబుల్ ఎక్స్‌పీరియన్స్. వయసుపైబడిన జట్టు అయినా.. అత్యుత్తమ కెప్టెన్ ధోనీ, ది బెస్ట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పర్యవేక్షణలో ఆడటం గొప్ప అనుభూతి. నేను ఇప్పటి వరకు చూసిన ఉత్తమ కోచ్ ఫ్లెమింగ్. అతని మేనేజ్‌మెంట్ స్కిల్స్, ఆటగాళ్లను, టీమ్ వాతావరణాన్ని అర్థం చేసుకునే విధానం అమోఘం. అతని క్రికెట్ నాలెడ్జ్ అల్టిమేట్. ధోనీతో ఉన్న అతని సంబంధం కూడా సూపర్'అని వాట్సన్ కొనియాడాడు.

ఆల్‌రౌండ్ షో..

ఆల్‌రౌండ్ షో..

ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ 3874 పరుగులు చేశాడు. అలాగే 92 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో రెండు సార్లు టైటిల్ అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరంభ సీజన్‌లో, 2018లో చెన్నై తరఫున చాంపియన్‌గా నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 10,950 పరుగులు చేసిన వాట్సన్ 291 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న సీఎస్‌కే ఆటగాళ్లను కూడా మార్చేసింది. షేన్ వాట్సన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. జట్టుకు అక్కర్లేదని భావించిన హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, పియూష్ చావ్లాను వదులుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో మొయిన్ అలీ, కృష్ణప్ప గౌతమ్‌ల​ను కొనుగోలు చేసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, March 4, 2021, 21:07 [IST]
Other articles published on Mar 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X