ధోనీకి ఉన్న స్కిల్స్‌తో 40 ఏళ్ల వయసులో కూడా ఆడగలడు: షేన్ వాట్సన్

ఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. మహీ 40 ఏళ్ల వయసులో కూడా అదే ఫామ్‌తో ఆడగలడని అభిప్రాయపడ్డాడు. ఆటకు వయసుతో సంబంధం లేదని.. ఏ వయసులో ఉన్నా సరే ఫిట్‌నెస్‌ బాగుంటే రాణించగలమన్నాడు. ఇక ధోనీకి తన శరీరాన్ని సమన్వయం చేసుకోవడం బాగా తెలుసని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చెన్నై సూపర్‌కింగ్స్‌ప్లేయర్ చెప్పుకొచ్చాడు.

ధోనీ ఆట చూడటం ఇష్టం..

ధోనీ ఆట చూడటం ఇష్టం..

‘ఇప్పటికీ ధోనీ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నాడు. అతనో ఎవర్‌ గ్రీన్‌ ఆటగాడు. మహీకి వయసుతో ఏ మాత్రం సంబంధం లేదు. అతనికి ఉన్న నైపుణ్యాలు, కష్టపడేతత్వంతో 40 ఏళ్ల వయసులో కూడా అంతే దూకుడుగా ఆడగలడు. ధోనీ తన శరీరాన్ని అద్భుతంగా సమన్వయం చేసుకుంటాడు. అదే కచ్చితమైన వేగంతో పరుగులు సాధిస్తాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. కీపింగ్‌లోనూ తనదైన శైలిని చూపించే ధోనీకి నేను పెద్ద అభిమానిని. అది ఐపీఎల్‌ లేక అంతర్జాతీయ మ్యాచ్‌ .. ఏదైనా కావొచ్చు అతని ఆటను ఎప్పటికి ఇష్టపడుతూనే ఉంటా.'అని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ​

పుష్కలమైన అవకాశాలు..

పుష్కలమైన అవకాశాలు..

ఐపీఎల్‌‌లో 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలపై స్పందిస్తూ.. అనుభవమైన ఆటగాళ్లు, అత్యద్భుతమైన కెప్టెన్, కోచ్‌తో కూడిన తమ జట్టుకు టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. ‘అందరితో పాటు మాకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుభవం కలిగిన ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లతో మిళితమైన మా జట్టు సమతూకంగా ఉంది. అందులోనూ ఎంఎస్‌ ధోనీ కెప్టెన్సీ.. కోచ్‌గా స్టీఫెన్‌ ప్లెమింగ్‌ ఉండడం జట్టుకు అదనపు బలం. ఇన్ని సానుకూల అంశాలతో ఉన్న మా జట్టుకు టైటిల్‌ గెలిచే సత్తా ఉంది. అలాగే దుబాయ్‌లో నెమ్మదైన పిచ్‌లు ఎక్కువ. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. మా జట్టులో హై క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి పరిస్థితులను అందిపుచ్చుకుంటాం'అని వాట్సన్ ధీమా వ్యక్తం చేశాడు.

ఫ్యాన్స్ లేకపోవడం లోటే..

ఫ్యాన్స్ లేకపోవడం లోటే..

చెన్నై ఫ్యాన్స్ క్రౌడ్‌ను మిస్సవ్వడం తమకు లోటేనని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ‘మా జట్టుకు ఎల్లో ఆర్మీ ఎప్పటిలాగే మద్దుతు ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈసారి వారికి దూరంగా టోర్నీ జరగుతుండటం, చెన్నై క్రౌడ్‌ను మిస్సవ్వడం మాకు తీరని లోటే. ప్రపంచంలోనే అత్యుత్తమైన టోర్నీలో ఆడుతున్నాం కాబట్టి ఈ ప్రతి కూల పరిస్థితులను త్వరగా అందిపుచ్చుకోవాలి'అని వాట్సన్ చెప్పుకొచ్చాడు.

రక్తం చిందించిన వాట్సన్..

రక్తం చిందించిన వాట్సన్..

ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇప్పటివరకు మూడుసార్లు టైటిల్( 2010,2011,2018) సాధించింది. గతేడాది ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ముంబైతో జరిగిన థ్రిల్లింగ్‌ ఫైనల్లో కేవలం ఒక్కపరుగు తేడాతో ఓడిపోయి నాలుగోసారి టైటిల్‌ను నెగ్గే అవకాశం కోల్పోయింది. ఈ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను గెలిపించేందుకు వాట్సన్(80) తన రక్తాన్ని చిందించాడు. మొకాలికి గాయమై రక్తం కారుతున్నా.. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్ కావడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఇక సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

ఆ క్షణమే సర్ఫరాజ్ అహ్మద్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సింది: రమీజ్ రాజా

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 12, 2020, 15:18 [IST]
Other articles published on Aug 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X