న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అసభ్యకర ఫోటోలు: తన ఫాలోవర్లను క్షమించమని అడిగిన షేన్ వాట్సన్

Shane Watsons Instagram and Twitter accounts hacked, ex-cricketer apologises for illicit photos

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. తన సోషల్ మీడియా ఖాతా ఇనిస్టాగ్రామ్‌లో మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలను పోస్టు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

గతవారంలో షేన్ వాట్సన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కాగా... తాజాగా మంగళవారం షేన్ వాట్సన్ ఇనిస్టాగ్రామ్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఈ క్రమంలో హ్యాకర్ లోదుస్తులు ధరించిన మహిళకు సంబంధించిన ఫోటోలు అతడి ఇనిస్టాగ్రామ్ ఖాతాలో దర్శనమిచ్చాయి.

ICC Women's T20 World Cup: క్రికెటర్లకు పండుగే, 320 శాతం పెరిగిన ఫ్రైజ్ మనీICC Women's T20 World Cup: క్రికెటర్లకు పండుగే, 320 శాతం పెరిగిన ఫ్రైజ్ మనీ

Shane Watsons Instagram and Twitter accounts hacked, ex-cricketer apologises for illicit photos

ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను ప్రముఖ బ్రిటీష్‌ టాబ్లాయిడ్‌ 'ది సన్‌' ప్రచురించింది. దీనిపై షేన్ వాట్సన్‌ తన ట్విట్టర్‌లో "నా ఇనిస్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారు. గత శుక్రవారం ఇదే విధంగా ట్విటర్‌ అకౌంట్‌ను కూడా హ్యాక్‌ చేశారు. ఈ సందర్భంగా మీ అందరితో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. నా ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలు ప్రత్యక్షమైనందుకు నన్ను ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరిని క్షమాపణ కోరుతున్నా. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ వారు త్వరగా స్పందించాలి. కానీ చాలా ఆలస్యంగా స్పందించారు. గత శుక్రవారం ఇలాగే జరిగినప్పుడు ట్విటర్‌ చాలా త్వరగా స్పందించింది. వారికి ధన్యవాదాలు. మళ్లీ ఇలా జరగదు" అని ట్వీట్ చేశాడు.

కాగా, షేన్‌ వాట్సన్‌ను సోషల్ మీడియా(ట్విట్టర్, ఇనిస్టాగ్రామ్)లో సుమారు 2 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో షేన్ వాట్సన్ తన ఫాలోవర్లకు క్షమాపణలు తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియా తరపున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఆస్ట్రేలియా గెలిచిన 2007, 2015 ప్రపంచకప్‌లలో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Story first published: Wednesday, October 16, 2019, 17:07 [IST]
Other articles published on Oct 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X