Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెచ్చిపోయిన వాట్సన్: కోల్‌కతా చిత్తు, ప్లే ఆఫ్‌కు రాజస్థాన్

ముంబై: కెప్టెన్ షేన్ వాట్సన్ (59 బంతుల్లో 104 పరుగులు) రెచ్చిపోవడంతో 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 199 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 9 వికెట్లకు 190 పరుగులకు పరిమితం చేయడం ద్వారా 9 పరుగుల తేడాతో గెలిచింది.

తద్వారా ప్లే ఆఫ్‌కు వచ్చింది. షేన్ వాట్సన్ ఆల్‌రౌండ్ ప్రతిభ రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఐపీఎల్ ఆరంభంలో వరుసగా ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్.. వర్షం పడటంతో రెండు మ్యాచులు రద్దు కావడం, మిగతా మ్యాచులలో ఓడిపోవడం ద్వారా ప్లే ఆఫ్ పైన సస్పెన్స్ సాగింది.

తొలుత వరుసగా ఐదు మ్యాచులు గెలిచిన రాజస్థాన్ తొలి ప్లే ఆఫ్ జట్టుగా అవుతుందనుకున్నారు. అనూహ్యంగా అది ఆ తర్వాత పరాజయాల బాట పట్టింది. చావోరేవో అనుకున్న చివరి మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. రాజస్థాన్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది.

వాట్సన్‌ అజేయ శతకానికి, క్రిస్‌ మోరిస్‌ (4/23) పదునైన బౌలింగ్‌ తోడవడంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ 9 వికెట్లతో కోల్‌కతాను ఓడించింది. దీంతో మొత్తం 16 పాయింట్లతో ప్లేఆఫ్‌ బెర్తు దక్కించుకుంది. రాజస్థాన్‌ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన కోల్‌కతా తొమ్మిది వికెట్లకు 190 రన్స్‌ చేసింది.

యూసుఫ్‌ పఠాన్‌ (35 బంతుల్లో 44) రాణించగా, రస్సెల్‌ (20 బంతుల్లో 37), ఉమేశ్‌ యాదవ్‌ (11 బంతుల్లో 24 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాండే (21), ఊతప్ప (14), షకీబల్‌ (13) ఫర్వాలేదనిపించారు. గంభీర్‌, సూర్యకుమార్‌ విఫలమయ్యారు. ఎక్స్‌ట్రాల రూపంలోనే కోల్‌కతాకు 26 పరుగులు వచ్చాయి.

రాయల్స్‌ బౌలర్లలో మోరిస్‌ నాలుగు, వాట్సన్‌, కులకర్ణి రెండేసి వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 199 పరుగులు చేసింది. రహానె (22 బంతుల్లో 37), కరుణ్‌ నాయర్‌ (16), స్టీవ్‌ స్మిత్‌ (14) రాణించారు. రస్సెల్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. వాట్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+