రికార్డులివే: బిగ్‌బాష్ లీగ్‌కు వీడ్కోలు పలికిన షేన్ వాట్సన్

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ బిగ్‌బాష్ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్ ఆస్ట్రేలియాలో జరిగే టీ20 టోర్నమెంట్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా, బిగ్‌బాష్ లీగ్‌కు వీడ్కోలు పలికాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బిగ్‌బాష్ లీగ్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్
ఇకపై తాను బీబీఎల్ ఆడటం లేదంటూ వాట్సన్ తెలిపాడు. ఈ మేరకు శుక‍్రవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. కుటుంబంతో మరింత సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న వాట్సన్ ఆసీస్ వేదికగా జరిగే బీబీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.

గత మూడు సీజన్ల నుంచి
గత మూడు సీజన్ల నుంచి బీబీఎల్‌లో సిడ్నీ థండర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వాట్సన్ తన జట్టులోని సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. సిడ్నీ థండర్‌తో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, అవి ఎప్పుడూ తన మదిలో పదిలంగానే ఉంటాయని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

సిడ్నీ థండర్ జట్టు తరుపున 1000 పరుగులు
ముఖ్యంగా నిక్ కమిన్స్, పాడీ ఆప్టన్, లీ జర్మన్, షేన్ బాండ్‌లతో తన అనుభవం ఎప్పటికీ మరచిపోలేనిదని తెలిపాడు. సిడ్నీ థండర్ జట్టు తరుపున 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ వాట్సనే కావడం విశేషం. గత సీజన్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో షేన్ వాట్సన్ 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.

అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్
అంతేకాదు 2018-19 సీజన్‌లో సిడ్నీ థండర్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో 3,731 పరుగులతో పాటు 75 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో 168 వికెట్లు తీసి 5,757 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications