Shane Watson's Top 5 Best Players In T20 World Cup : టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపే అయిదుగురు వీరే..!

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ టీ20 ప్రపంచకప్ టోర్నీలో టాప్ 5 ప్లేయర్ల లిస్టును తన అభిప్రాయం ప్రకారం పేర్కొన్నాడు. ఈ లిస్టులో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు కూడా చోటు కల్పించాడు. ఆల్ టైమ్ ఆస్ట్రేలియా అత్యుత్తమ వైట్-బాల్ ప్లేయర్‌లలో ఒకడిగా పేరొందిన వాట్సన్.. ఇటీవల కోచ్‌గా మారి యువ ప్రతిభావంతులను మెరుగుపర్చే బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ టీ20 ప్లేయర్ల లిస్టును వాట్సన్ తెలిపి అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు. టాప్ 5లో టాప్ 2 బ్యాటర్‌గా సూర్యకుమార్‌ని పేర్కొన్నాడు. ఐసీసీ రివ్యూలో ఈ మేరకు వాట్సన్ తన విశ్లేషణను వివరించాడు.

బాబర్ ఆజామ్
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ నంబర్ 1 వరల్డ్ కప్ టీ20 ప్లేయర్ అవుతాడని వాట్సన్ అంచనా వేశాడు. 'ర్యాంకు పరంగా చూసుకున్నా బాబర్ ఆజామ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 టీ20I బ్యాట్స్‌మెన్. అతనికి ఆటలో ఎలా ఆధిపత్యం చెలాయించాలో తెలుసు. అతను పెద్ద రిస్క్ తీసుకున్నట్లు కూడా కన్పించదు. కానీ పరుగులు మాత్రం అతని బ్యాట్ నుంచి జాలువారుతాయి. అతను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లపై అతి ఈజీగా స్కోర్ చేస్తాడు. అతనికి ఆస్ట్రేలియా పరిస్థితులలో తన టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ వరల్డ్ కప్ బెస్ట్ బ్యాటర్ అతనే' అని పేర్కొన్నాడు.

సూర్యకుమార్ యాదవ్
'సూర్యకుమార్ ఇటీవల చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను నా లిస్టులో నంబర్ 2 టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ అవుతాడు. ఆస్ట్రేలియా పరిస్థితులు అతని బ్యాటింగ్ శైలికి సరిపోతాయి. అతని ఫామ్, వైవిధ్యభరితమైన షాట్లు అన్నీ కూడా ప్రస్తుతం సరిగ్గా ఉన్నాయి. కాసేపు నిలదొక్కుకుంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని కూడా మార్చే సత్తా ఉన్న ప్లేయర్. ప్రత్యర్థి బౌలర్లు సూర్య విషయంలో మైనస్ పాయింట్లు కనుక్కోవడం కూడా కష్టమే. ఎందుకంటే అతను 360 డిగ్రీల షాట్లు ఆడగలడు' అని పేర్కొన్నాడు.

డేవిడ్ వార్నర్
ఇక అత్యుత్తమ మూడో టీ20 వరల్డ్ కప్ ప్లేయర్‌గా వాట్సన్ ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ని ప్రెడిక్ట్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2021లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును వార్నర్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్ 2022లో) మంచి ప్రదర్శన కనబరిచాడు. అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతను తనదైన ముద్ర వేస్తాడు. అతను మంచి ఫామ్ పుంజుకుంటాడు అని షేన్ వాట్సన్ చెప్పాడు.

జోస్ బట్లర్
ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను తన టాప్ 5 జాబితాలో 4వ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో బట్లర్ ఆధిపత్యం కొనసాగిస్తాడని చెప్పాడు. ఐపీఎల్ సమయంలో అతన్ని ఎవరూ ఆపలేరని, అదే మోజో వరల్డ్ కప్‌లో రిపీట్ అవుతుందని పేర్కొన్నాడు. ఇకపోతే ఐపీఎల్ 2022లో బట్లర్ నాలుగు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అతను ఫామ్‌లో ఉన్నప్పుడు అతన్ని అవుట్ చేయడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నాడు. అతను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ల బౌలింగ్లో తాను కొట్టాలనుకున్న షాట్ ఎంచక్కా కొట్టగలడు. అతనికి ఆస్ట్రేలియన్ పరిస్థితులు బాగా తెలుసు. అతను బిగ్ బాష్ లీగ్ కూడా ఆడాడు. అని వాట్సన్ చెప్పాడు.

షాహీన్ అఫ్రిది
మోకాలి గాయంతో ఆసియా కప్‌కు దూరం అయిన షాహీన్ అఫ్రిదిని తన లిస్టులో టాప్ 5 ప్లేయర్‌గా వాట్సన్ అభివర్ణించాడు. 'అతని వికెట్ తీయగల సామర్థ్యం చాలా ప్రత్యేకమైంది. గత టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయగల అతని సామర్థ్యాన్ని మనం చూశాం. ఆస్ట్రేలియన్ పిచ్ కండిషన్లపై అతను ఆధిపత్యం చెలాయించగలడు. బంతి మంచి స్వింగ్ అవుతుంది. అలాగే బౌన్సీ అవుతుంది. అందువల్ల అతను వికెట్లు తీయగలడు. ఇక మరో విషయమేంటంటే.. అతను ఆరంభంలో వికెట్లు తీయకపోతే మాత్రం అతన్ని బ్యాటర్లు సులువుగా ఎదుర్కోగలుగుతారు. కాబట్టి పవర్ ప్లేలోనే అతని పవర్ ఎక్కువ.' అని వాట్సన్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications