Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shane Watson: కెప్టెన్‌గా జడేజా విషయంలో జరిగిన దానికి చింతిస్తున్నా

Shane Watson: I feel a little sorry for what happened in the case of Jadeja in terms of captaincy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఆరు పాయింట్లతో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో కెప్టెన్సీ మార్పులతో సీఎస్కే ఆటతీరు కొంత భిన్నంగా మారినట్లు కన్పిస్తోంది. ఐపీఎల్ 2022ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీ రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. ఎనిమిది మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన రవీంద్ర జడేజా తన ఆటపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పి తిరిగి కెప్టెన్సీని ధోనీకే అప్పగించాడు. కెప్టెన్‌గా జడేజా ఉన్నప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పేలవ ప్రదర్శన కనబరిచాడు. ధోనీ సైతం కెప్టెన్సీ జడేజా ఆటను ప్రభావితం చేసిందని అంగీకరించాడు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ స్పందించాడు. జడేజా పట్ల తనకు కొంచెం విచారం ఉందంటూ పేర్కొన్నాడు.

సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు జడేజా చేపట్టబోతున్నాడని తెలిసి నేను మొదట్లో షాకయ్యాను. ఎందుకంటే ఎంఎస్ ధోనీ ఆడుతుండగా.. జడేజా కెప్టెన్సీ చేయడం అంటే మామూలు కాదు. ఎంఎస్ ధోనీ ఆడకపోయినా లేక గాయపడినా లేదా అతనికి ఆట కోసం విశ్రాంతి ఇచ్చినా కచ్చితంగా జడేజాను కెప్టెన్‌గా చేస్తే అతనికి అదో గొప్ప అవకాశంగా ఉండేది. కానీ ధోనీ ఉండగా జడ్డూను కెప్టెన్ చేయడం కాస్త వెరైటీగా అనిపించింది. ధోనీ మైదానంలో ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టడం జడేజాకు ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుందని అని వాట్సన్ ది గ్రేడ్ క్రికెటర్ పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు.

కెప్టెన్సీ పరంగా జడేజా విషయంలో జరిగిన దానికి నేను కొంచెం జాలిపడుతున్నాను ఎందుకంటే అతను గొప్ప వ్యక్తి, అద్భుతమైన నైపుణ్యం కలిగిన క్రికెటర్. అతను ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాడు. అలాంటిది ఒక్కసారిగా కెప్టెన్సీ భారం అప్పగించేసరికి దానిని సరిగా చేయలేకపోతున్నా అన్న భావనలో బహిరంగంగా తాను కెప్టెన్సీని వదులుకుని ధోనీకి అప్పగిస్తున్నట్లు తెలియజేసేలా చెప్పడం చాలా బాధించింది. జడేజా తన విషయాన్ని గ్రహించి చివరికి ధోనీకి బాధ్యతలు అప్పజెప్పడం సరైనది. కొంచెం ఒత్తిడి ఉన్నప్పుడు కెప్టెన్‌గా వైదొలగడం నిజంగా గొప్ప విషయం. మరొకరు మనల్ని తీసేయకుండా మనంతట మనమే వైదొలిగి ఓ గౌరవప్రదంగా తప్పుకోవడం జడేజా చేసిన మంచి పని అని అతను భవిష్యత్తులో పాఠాలు నేర్చుకుని మళ్లీ తిరిగి సత్తా చాటుతాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున కెప్టెన్ గా ఉన్నప్పుడు ఓటములు వేధిస్తున్న తరుణంలో ప్రెషర్ పెరిగి.. పబ్లిక్ షేమ్ అవుతున్నామని ఫీలింగ్ వచ్చింది. నేను కూడా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా వైదొలగాల్సి వచ్చింది అని వాట్సన్ తెలిపాడు. ఈ సీజన్‌లో జడేజా 10గేమ్‌లలో 116పరుగులు చేశాడు. కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు.

Story first published: Saturday, May 7, 2022, 16:42 [IST]
Other articles published on May 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+