Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shane Watson: టీ20 ప్రపంచకప్‌లో ఇండియాకు బిగ్గెస్ట్ లాస్ కన్ఫామ్..! అదొక్కటే మార్గం

Shane Watson Big Prediction On Teamindia Performance In T20 World Cup Without Bumrah

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్.. టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు విషయం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా టీ20ప్రపంచకప్‌లో ఆడకపోతే.. అది టీమిండియాకు బిగ్గెస్ట్ లాస్ అవుతందన్నాడు. అందువల్ల భారత్ టోర్నీ గెలవడం దాదాపు అసాధ్యమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. బుమ్రా ఇటీవల ఆసీస్‌తో జరిగిన సిరీస్లో తిరగి జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌ నుంచి మరోసారి జట్టుకు దూరమయ్యాడు.

వెన్ను ఫ్రాక్టర్ తీవ్రంగా ఉందని.. అతను ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు మిస్సవ్వడం ఖాయమని విశ్వసనీయ సమాచారం అందిన సంగతి తెలిసిందే. ఇక అతను టీ20 ప్రపంచకప్‌కు దూరమైన విషయాన్ని బీసీసీఐ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించట్లేదు. తాము ఇంకా బుమ్రాను మానిటర్ చేస్తున్నామంటూ పేర్కొంది.

బుమ్రాకు సరితూగగల బౌలర్ ప్రపంచంలోనే లేడు

బుమ్రాకు సరితూగగల బౌలర్ ప్రపంచంలోనే లేడు

ఇకపోతే టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌‌కు బుమ్రా అందుబాటులో ఉండే విషయమై తీవ్ర సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీతో మాట్లాడిన వాట్సన్.. పేస్ గుర్రం ప్రపంచ‌కప్‌కు అందుబాటులో లేకుంటే టీమిండియాకు తీరని నష్టం కలగడం కన్ఫామ్ అన్నాడు. అతను అటాకింగ్, అలాగే నిఖార్సైన డిఫెన్సివ్ బౌలర్‌ అని పేర్కొన్నాడు.

అందువల్ల అతను మిస్సయితే టీమిండియా టోర్నమెంట్ గెలవడం కష్టమే. ఈ ప్రపంచంలో బుమ్రాకు సరితూగగల ప్రత్యామ్నాయ బౌలర్ ప్రస్తుతం ఎవరూ లేరని.. అతనో యూనిక్ క్వాలిటీ బౌలర్ అని పేర్కొన్నాడు. భారత్ ప్రపంచకప్‌లో ముందుకు సాగాలంటే.. మిగతా పేసర్లు తమ బెస్ట్ అండ్ బెస్ట్ ఇవ్వడానికి మ్యాక్సిమమ్ ప్రయత్నం చేయాల్సిందేనని వేరే మార్గమే లేదని తెలిపాడు.

సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే..

సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే..

ఆదివారం సౌతాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో శనివారం భారత ప్రధాన కోచ్ ద్రావిడ్ మీడియాతో మాట్లాడుతూ.. బుమ్రా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఇప్పటి వరకు తమకు అందిన అధికారిక ప్రకటన ప్రకారం.. బుమ్రా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మాత్రమే దూరమయ్యాడని చెప్పాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రా రిహబిలిటేషన్ సాగుతుందని, అక్కడ వైద్య బృందం పరిశీలించి పరిస్థితి ఏంటనేది వెల్లడిస్తుందని, ఏం జరుగుతుందో చూద్దామని ద్రావిడ్ అన్నాడు.

ఆ రోజు ఫైనల్ డిసిషన్

ఆ రోజు ఫైనల్ డిసిషన్

ఓ బీసీసీఐ అధికారి బుమ్రా గురించి కాస్త ముఖ్యమైన విషయాలు చెప్పాడు. జట్టుతోనే బుమ్రా ఆస్ట్రేలియాకు వెళ్తాడని, అక్టోబర్ 15న అతని గాయంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. 'బుమ్రాకు విశ్రాంతి అవసరం. అతని బ్యాక్ ఇంజ్యూరీకి రెస్ట్ ఇవ్వడం సరైన పని. ప్రస్తుతం అతను ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఫిజియో నితిన్ పటేల్ అతని గాయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో కూడా బుమ్రా గాయం రికవరీ ప్రాసెస్ కొనసాగనుంది. అక్టోబర్ 15 వరకు వేచి చూసి ఆ రోజే తుది నిర్ణయం తీసుకుంటాం' అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు.

Story first published: Sunday, October 2, 2022, 13:15 [IST]
Other articles published on Oct 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+