షేన్ వాట్సన్ కొత్త ఇన్నింగ్స్.. ఏసీఏ హెడ్‌గా బాధ్యతలు!!

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) హెడ్‌గా వాట్సన్ నియమించబడ్డారు. సోమవారం రాత్రి జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వాట్సన్‌ను ఏసీఏ హెడ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఆడిన సమయంలో తనదైన శైలిలో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన వాట్సన్‌పై నమ్మకం ఉంచిన ఏజీఎం సభ్యులు ఈ బాధ్యతను అతనికి కట్టబెట్టారు.

గొప్ప గౌరవం:
నియామకం అనంతరం షేన్ వాట్సన్ మాట్లాడుతూ...'ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. దాంతో పాటు ఇదొక పెద్ద బాధ్యత కూడా. ఆసీస్ క్రికెటర్ల నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంటా. నాకు ఆస్ట్రేలియా క్రికెట్ ఏమైతే ఇచ్చిందో దాన్ని తిరిగి ఈ రూపంలో తీర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం' అని వాట్సన్ ట్వీట్ చేసాడు.

14 సెంచరీలు, 67 అర్ధ సెంచరీలు:
తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ బోర్డులోని సభ్యులను 10 మందికి పెంచుతూ ఏజీఎం నిర్ణయం తీసుకుంది. ఇందులో మూడు కొత్త ముఖాలకు తొలిసారి అవకాశం కల్పించారు. షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా తరపున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. టెస్టులలో 3731పరుగులు, వన్డేలలో 5757 పరుగులు, టీ20లలో 1462 పరుగులు చేసాడు. మొత్తంగా 14 సెంచరీలు, 67 అర్ధ సెంచరీలు చేసాడు. వాట్సన్ మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు చేసాడు. అయితే ఫార్మాట్‌లో కూడా డబుల్ సెంచరీ మాత్రం చేయలేదు.

ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ
వాట్సన్ రిటైర్మెంట్ తీసుకున్నా.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లకు కూడా ఆడాడు. చెన్నై జట్టు ఐపీఎల్ 2018 ట్రోఫీ గెలవడంతో వాట్సన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసి జట్టుకు అద్భుత విజయంతో పాటు ట్రోఫీని అందించాడు. గత సీజన్‌లో కూడా ఫైనల్ మ్యాచ్‌లో పోరాడినా.. చివరకు ఔట్ అవవడంతో చెన్నై కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయింది.

రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగతం:
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి గతంలో వాట్సన్ స్పందించాడు. ధోనీ ఇప్పటికీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. కానీ.. రిటైర్మెంట్ అనేది అతని వ్యక్తిగత నిర్ణయం. ధోనీ ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే తీసుకుంటాడు. ధోనీ ఎందరో యువకులకు స్ఫూర్తి. అతనిలా క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు' అని వాట్సన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications